Pakistan vs Bangladesh 1st Test : పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది. టెస్టుల్లో తొలిసారి పాక్‌ను ఓడించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. అంతేకాకుండా సొంతగడ్డపై పాకిస్థాన్‌ను పది వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగానూ బంగ్లాదేశ్ రికార్డు సృష్టించింది. ఓవర్‌నైట్ స్కోరు 23/1తో ఐదో రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్థాన్ 146 పరుగులకే (55.5 ఓవర్లలో) ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 448/6 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బంగ్లాదేశ్ బ్యాటుతో అదరగొట్టి 565 పరుగులకు ఆలౌటైంది.
పాకిస్థాన్‌కు గట్టి షాక్- ఫస్ట్ టెస్ట్‌లో బంగ్లా సూపర్ వికర్టీ- సొంతగడ్డపై తొలిసారిగా! - Pakistan vs Bangladesh Test Series - PAKISTAN VS BANGLADESH TEST SERIES
Pakistan vs Bangladesh Test : టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. పాకిస్థాన్‌ను ఓడించి, తొలిసారిగా విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌ను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
Published : Aug 25, 2024, 4:38 PM IST
రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లలో ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ (37), వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (51) మాత్రమే రాణించారు. బాబర్ అజామ్ (22), షాన్ మసూద్ (14) పరుగులు ఇచ్చారు. ఆయూబ్ (1), షౌద్ షకీల్ (0), ఆఘా సల్మాన్ (0) వచ్చిన వెంటనే పెవిలియన్‌కు వెళ్లిపోయారు. మెహదీ హసన్ మిరాజ్ (4/21), షకీబ్ అల్ హసన్ (3/44) పాక్‌ను వికెట్లతో దెబ్బకొట్టారు. షోరిపుల్ ఇస్లామ్, హసన్ మహమూద్, నిహిద్ రాణా చెరో వికెట్ పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్‌లో
ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ భారీ స్కోరు చేయడంలో ముష్ఫికర్ రహీమ్ (191; 341 బంతుల్లో) కీలకపాత్ర పోషించాడు. షాద్మాన్ ఇస్లాం 93 పరుగులు చేసి, త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. మోమినుల్ హక్ (50), లిటన్ దాస్ (56), మెహదీ హసన్ (77) అర్ధ శతకాలు బాదారు. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు సౌద్ షకీల్ (141), మహ్మద్ రిజ్వాన్ (171) భారీ శతకాలు సాధించారు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఆగస్టు 30 నుంచి రావల్పిండి వేదికగానే రెండో టెస్టు ప్రారంభం కానుంది.