U19 AUS vs U19 PAK :అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్‌కు పోటీపడనున్న జట్లు పేర్లు ఖరారైంది. బెనోని వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఒక్క వికెట్ తేడాతో పైచేయి సాధించింది. దీంతో ఆదివారం జరగనున్న తుది మ్యాచ్‌లో భారత్‌ను ఢీ కొట్టే ఛాన్స్ అందుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టామ్ స్ట్రేకర్ (24/6) దెబ్బకు పాక్ డీలా పడిపోయింది. అలా సరైన సమయంలో వికెట్లు పడగొట్టి పాక్ పరాజయానికి అతడు బాటలు వేశాడు. పాక్ ప్లేయర్లలో అజాన్ అవైస్ (52),అరాఫత్ మిన్హాస్ (52) హాఫ్ సెంచరీలు సాధించారు. ఓపెనర్ షమైల్ హుస్సేన్ (17) ఫర్వాలేదనిపించగా, మిగతా ప్లేయర్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లలో స్ట్రేకర్ 6 వికెట్లు పడగొట్టగా మహిల్ బియర్డ్‌మ్యాన్, గాలం విడ్లెర్,రాఫ్ మెక్‌మిలాన్, టామ్ గాంప్‌బెల్ తలో వికెట్ తీశారు.
Austarlia Vs Pakistan U 19 : ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన యంగ్ ఆసీస్ జట్టుకు విజయం అంత సులువుగా లభించలేదు. కట్టుదిట్టమైన బంతులు వేస్తూ పాక్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. 59 పరుగులకే నాలుగు కీలక వికెట్లను పడగొట్టి, కంగారూలను మరింతగా కంగారు పెట్టారు. దీంతో ఓ వైపు వికెట్లు పడిపోతున్నా కూడా ఓపెనర్ హ్యారీ డిక్సన్ (50), క్రీజులో నిలదొక్కుకుంటూ ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ఓలివర్ పీక్ (49), టామ్ గాంప్‌బెల్ (25) పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో వచ్చిన రాఫ్ మ్యాక్ మిలన్ (19*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చివరి ఓవర్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా, క్రీజులో ఉన్న చివరి బ్యాట్స్‌మన్ జీషన్ (4*) బౌండరీ బాదడం వల్ల మ్యాచ్ ముగిసింది. ఇక పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు పడగొట్టగా, మిన్హాస్ 2, బెయిడ్ షా, నవీద్ అహ్మద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
అండర్ -19 వరల్డ్ కప్ : పాకిస్థాన్ గెలవాలని కోరుకుంటున్న భారత్ ఫ్యాన్స్!
అండర్ - 19 వరల్డ్ కప్ : 'అదే మా ప్లాన్ - అందుకే గెలిచాం'