తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమ్ఇండియా ప్లేయర్లను హగ్ చేసుకోవద్దు- కోహ్లీతో కూడా నో ఫ్రెండ్​షిప్'- పాకిస్థాన్​కు స్ట్రాంగ్ మెసేజ్ - 2025 CHAMPIONS TROPHY

భారత్​పై పాకిస్థాన్ ఫ్యాన్స్ గుస్సా- ఆ నిర్ణయం వాళ్లకు నచ్చలేదట!

IND vs PAK
IND vs PAK (Source : Getty Images)

By ETV Bharat Sports Team

Published : Feb 15, 2025, 5:24 PM IST

IND vs PAK Champions Trophy : 2025 ఛాంపియన్స్​ ట్రోఫీ నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​లో పాకిస్థాన్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఐసీసీ టోర్నీ ఏదైనా సరే భారత్- పాకిస్థాన్ మ్యాచ్​కు ఉండే హైప్ వేరు. ఫిబ్రవరి 23న దుబాయ్​లో జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్​ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తుంది. ఐసీసీ ఈవెంట్లలో పాక్​పై ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే రిపీట్ చేయాలని భావిస్తోంది.

మరోవైపు ఈసారి ఎలాగైనా తమ జట్టు భారత్​ను ఓడించాలని పాక్​ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. అలాగే పాకిస్థాన్​ గడ్డపై మ్యాచ్ అడేందుకు బీసీసీఐ ఒప్పుకోకపోవడం వల్ల ఆ దేశ అభిమానులు నిరాశ చెందారు. దీంతో పాక్​ ప్లేయర్లకు అక్కడి ఫ్యాన్స్ బలమైన సందేశం పంపించారు. భారత్​తో మ్యాచ్​ సందర్భంగా వాళ్లతో ఫ్రెండ్​షిప్ పక్కనపెట్టాలని హెచ్చరించారు. అలాగే విరాట్ కోహ్లీ సహా, టీమ్ఇండియా ప్లేయర్లెవరినీ కూడా హగ్ చేసుకోవద్దని చెప్పారు. ఈ మేరకు పాక్‌ జర్నలిస్ట్‌ ఒకరు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది.

కారణం ఇదే
ఈ ఎడిషన్​కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. దీంతో చాలా ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టీమ్ఇండియా మ్యాచ్​ ఆడుతుందని అక్కడి ఫ్యాన్స్ ఆశించారు. కానీ, భద్రతా కారణాల వల్ల భారత్ జట్టును పాకిస్థాన్​కు పంపేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో భారత్ మ్యాచ్​లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి.

అయితే పాకిస్థాన్​ గడ్డపై భారత్​తో మ్యాచ్​ జరిగితే చూడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నట్లు అక్కడి ఫ్యాన్స్ చెబుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి పెద్ద స్టార్లను చూడవచ్చని ఆశించారట. అయితే భారత్ మ్యాచ్​లు దుబాయ్​కు షిఫ్ట్ అవ్వడం వల్ల వాళ్లు నిరాశ చెందినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details