తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నాకు గురువు కన్నా ఎక్కువ'- కోచ్​కు నీరజ్​ ఎమోషనల్ ఫేర్​వెల్​

నీరజ్ చోప్రా కోచ్ బార్టోనిట్జ్ కోచింగ్ కెరీర్​కు గుడ్​ బై- ఎమోషనలైన ఒలింపిక్ మెడల్ విన్నర్

Neeraj Chopra Coach
Neeraj Chopra Coach (Source: Getty Images)

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Neeraj Chopra Coach :ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా తన కోచ్‌ క్లాస్‌ బార్టోనీజ్‌కు ఎమోషనల్ సెండాఫ్ ఇచ్చాడు. 5ఏళ్లుగా తనకు కోచ్​గా ఉంటున్న 75 ఏళ్ల​ బార్టోనీజ్‌ కుటుంబ కారణాలతో కోచింగ్ కెరీర్​కు ముగింపు పలికాడు. ఈ క్రమంలో నీరజ్ భావోద్వేగానికి గురయ్యాడు. తన కోచ్​తో ఓ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

'ఎక్కడ ప్రారంభించాలో తెలియకుండానే ఇది రాస్తున్నాను. నాకు మీరు గురువు కన్నా ఎక్కువ. ఓ ఆటగాడిగా, వ్యక్తిగా ఎదగడానికి మీరు నాకు ఎంతో నేర్పించారు. ప్రతీ పోటీలో నేను ఫిజికల్​గా, మెంటల్​గా ఉండడం కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. నాలో కాన్ఫిడెంట్ నింపారు. ​గాయం కారణంగా నేను ఇబ్బందిపడ్డ రోజుల్లో నాకు అండగానూ నిలిచారు. కెరీర్ ఎత్తుపల్లాలో నాకు తోడుగా ఉన్నారు. స్టాండ్స్‌లో మీరు చాలా సైలెంట్​ ఉంటారు. కానీ, జావెలిన్‌ విసురుతున్నప్పుడు మీరు చెప్పిన మాటలు నా చెవుల్లో మార్మోగుతూ ఉంటాయి. మీ ప్రాంక్‌లు, మీ నవ్వులు లేకపోవడం ఇకపై నాకు అదొక లోటు. నా జర్నీలో భాగమైనందుకు థాంక్స్​. మీ జర్నీలో నన్ను భాగం కానిచ్చినందుకు కృతజ్ఞతలు' అని నీరజ్‌ ఎక్స్‌లో పేర్కొన్నాడు.

కాగా, జర్మనీకి చెందిన 75ఏళ్ల బార్టోనిట్జ్ గత ఐదేళ్లుగా నీరజ్​కు శిక్షణ ఇస్తున్నారు. తొలుత బయోమెకానిక్స్ నిపుణుడుగా వచ్చిన బార్టోనిట్జ్, ఆ తర్వాత కోచ్​గా నియామకమయ్యాడు. బార్టోనిట్జ్ ఆధ్వర్యంలో నీరజ్ చోప్రా తన కెరీర్​లో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ (2020) ​లో స్వర్ణం, పారిస్ ఒలింపిక్స్​ (2024) లో రజతాన్ని సాధించాడు.

అలాగే ప్రపంచ, డైమండ్ లీగ్ ఛాంపియన్​గా నిలిచాడు. ఆసియా క్రీడల్లోనూ నీరజ్ గోల్డ్ దక్కించుకున్నాడు. బార్టోనిట్జ్ కోచింగ్​లో నీరజ్ చోప్రా అద్భుతంగా రాణించాడు. అయితే వయసు రీత్యా, ఇకపై తన ఫ్యామిలీకి సమయం కేటాయించడానికి బార్టోనిట్జ్​ ఈ భాగస్వామ్యానికి గత నెల గుడ్​బై చెప్పాడు.

నీరజ్ చోప్రా కోచ్ షాకింగ్ డెసిషన్ - కెరీర్​కు ఫుల్​స్టాప్ పెట్టనున్నాడా? - Neeraj Chopra Coach

'మీ చేతి చుర్మా తిన్నాక మా అమ్మ గుర్తొచ్చారు'- నీరజ్‌ తల్లికి ప్రధాని మోదీ లేఖ - Neeraj Chopra Mom Special Dish

ABOUT THE AUTHOR

...view details