ఒలింపిక్స్, పారాలింపిక్స్ అథ్లెట్లకు అంబానీ ఇంట్లో ప్రత్యేక విందు - Nita Ambani Honours Athletes - NITA AMBANI HONOURS ATHLETES
Nita Ambani Honours Athletes : ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందానికి అంబానీ ఫ్యామిలీ ప్రత్యేక ఆతిథ్యమిచ్చింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాలు స్టోరీలో
Published : Sep 30, 2024, 9:04 AM IST
|Updated : Sep 30, 2024, 11:02 AM IST
Nita Ambani Honours Athletes :ఇటీవలే ప్రపంచ వేదికపై జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత ఒలింపియన్లు, పారాలింపియన్లను సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ వారందరినీ ప్రత్యేకంగా సత్కరించారు. ముంబయిలోని తమ నివాసం యాంటీలియాకు పిలిపించి మరీ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఆదివారం రాత్రి ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.