SA vs NZ Womens T20 World Cup Final :న్యూజిలాండ్ మహిళల జట్టు 2024 టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్స్‌గా నిలిచింది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ పోరులో కీవీస్ 32 పరుగుల తేడాతో నెగ్గింది. ఫలితంగా తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది. 159 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 126-9 స్కోర్‌కే పరిమితమైంది. లారా వోల్వార్ట్ (33 పరుగులు) మాత్రమే రాణించింది. దీంతో రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కివీస్ బౌలర్లలో అమెలియా కేర్, రోస్మెరీ చెరో 3, కర్సన్, జొనాస్, బ్రూక్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అమెలియా కేర్ (43 పరుగులు), బ్రూకీ (38 పరుగులు) సూజీ బీట్స్ (32 పరుగులు) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో నొంకులెకొ 2, డి క్లర్క్, అయబొంగ, చొలే తలో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, ఇప్పటివరకు అత్యధికంగా ఆస్ట్రేలియా (2010, 2012, 2014, 2018, 2020, 2023) ఆరుసార్లు టైటిల్ దక్కించుకోగా, ఇంగ్లాండ్ (2009), వెస్టిండీస్ (2016) ఒక్కోసారి ఛాంపియన్‌గా నిలిచాయి. ఇక తాజాగా ఛాంపియన్స్ లిస్ట్‌లోకి న్యూజిలాండ్ కూడా చేరిపోయింది.
మిథాలీ రికార్డ్ బ్రేక్
న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలిచింది. 2006లో అరంగేట్రం చేసిన బేట్స్ 18ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇప్పటివరకు 334 మ్యాచ్‌లు ఆడింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ రికార్డ్ బ్రేక్ చేసింది. టీమ్ఇండియాకు దాదాపు రెండు దశాబ్దాల కాలంలో మిథాలీ 333 మ్యాచ్‌లు ఆడింది. తాజాగా ఈ రికార్డును బేట్స్ అధిగమించింది.
అత్యధిక ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఉమెన్ క్రికెటర్లు
- సుజీ బేట్స్ (న్యూజిలాండ్) - 334 (163 వన్డేలు, 171 టీ20లు)
- మిథాలీ రాజ్ (భారత్) - 333 (12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20లు)
- ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా) - 322 (13 టెస్టులు, 147 వన్డేలు 162 టీ20లు)
- హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్) - 316 (6 టెస్టులు, 133 వన్డేలు, 177 టీ20లు)
- షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) - 309 (23 టెస్టులు, 191 వన్డేలు, 95 టీ20లు)