New Zealand Pacer Neil Wagner Retirement : న్యూజిలాండ్ వెటరన్ పేసర్ నీల్ వాగ్నర్ షాకింగ్ న్యూస్ అనౌన్స్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఫిబ్రవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ అనంతరం తాను ఇంటర్ననేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటానని వెల్లడించాడు.
ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు : "న్యూజిలాండ్ తరపున అత్యున్నత స్ధాయిలో ఆడటం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. కివీస్ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ప్రతి ఒక్క క్షణాన్ని ఎంతగానో ఆస్వాదించాను. అయితే ఇప్పుడు కొత్త ప్లేయర్స్‌కు ఛాన్స్ ఇచ్చే సమయం అసన్నమైంది. అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఆసీస్‌తో సిరీస్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు విడ్కోలు పలుకుతాను. నా 12 ఏళ్ల కెరీర్‌లో అండగా నిలిచిన న్యూజిలాండ్ క్రికెట్‌కు, సహ ఆటగాళ్లకు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చాడు నీల్. ఇక నీల్ వాగ్నర్ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ కూడా ధృవీకరించింది.
అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా : దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి వాగ్నర్. 2008లో న్యూజిలాండ్‌కు తన మకాంను మార్చాడు. అలా దేశీవాళీ క్రికెట్‌లో ఒటాగో వోల్ట్స్, నార్తరన్ డిస్ట్రిక్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసి కివీస్ తరపున వాగ్నర్ అరంగేట్రం చేశాడు నీల్. 2012లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ తరపున ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి తనదైన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్నాడు. 37 ఏళ్ల వాగ్నర్ కేవలం టెస్టుల్లో మాత్రమే కివీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 64 టెస్టులు ఆడాడు. మొత్తంగా 260 వికెట్లు తీశాడు. అలా టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదో కివీస్ బౌలర్‌గా వాగ్నర్ నిలిచాడు.