Gujrat Titans IPL 2025 :ఐపీఎల్ ప్రాంఛైజీల్లో గుజరాత్ టైటాన్స్ ఒకటి. 2021లో సీవీసీ క్యాపిటల్ పార్ట్ నర్స్ (ఇరేలియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్) గుజరాత్ టైటాన్స్‌ను కొనుగోలు చేసింది. 2022 సీజన్‌లో ఈ జట్టు ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దాదాపు 67 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వాటాను భారత వ్యాపార సంస్థ టోరెంటో కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
"టొరెంట్ గ్రూప్ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలో మూడింట రెండు వంతులు (67 శాతం) కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ ఓనర్ షిప్ 4ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ (అగ్రిమెంట్) 2025 ఫిబ్రవరితో ముగుస్తుంది. ఆ తర్వాత వారు వాటాలను స్వేచ్ఛగా విక్రయించుకోవచ్చు. టొరెంట్ గ్రూప్ భారతదేశంలోని ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రముఖమైనది. 2021లో బీసీసీఐ రెండు కొత్త జట్ల కోసం బిడ్లను ఆహ్వానించినప్పుడు టొరంట్ గ్రూప్ ఆసక్తి కనబరించింది. యాజమాన్య మార్పుకు బీసీసీఐ ఆమోదం అవసరం. రాబోయే రోజుల్లో బీసీసీఐ అప్రూవల్ లభిస్తుంది." అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి
టొరెంట్ గ్రూప్ దాదాపు రూ. 41,000 కోట్ల విలువను కలిగి ఉంది. 2021లోనే రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది. గుజరాత్ (రూ. 4,653 కోట్లు), లఖ్ నవూ (రూ. 4,356 కోట్లు) వేలం వేశాయి.