తెలంగాణ

telangana

ETV Bharat / sports

సీఎస్కే మొదటి ఛాయిస్​ ధోనీ కాదు - అప్పుడు అసలేం జరిగిందంటే? - IPL CSK Captaincy Dhoni - IPL CSK CAPTAINCY DHONI

IPL CSK CAPTAINCY DHONI : ఐపీఎల్‌లో సీఎస్కేకు ధోనీ మారుపేరుగా అయిపోయాడు. టీమ్‌ను అత్యుత్తమంగా నిలిపి, భారీ సంఖ్యలో అభిమానులు సొంతం చేసుకున్నాడు. అయితే అప్పట్లో సీఎస్కే కెప్టెన్‌గా మొదటి ఛాయిస్​ ధోనీ కాదట. పూర్తి వివరాలు స్టోరీలో

source IANS
IPL CSK CAPTAINCY DHONI (source IANS)

By ETV Bharat Sports Team

Published : Sep 13, 2024, 9:06 PM IST

IPL CSK CAPTAINCY DHONI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో విజయవంతమైన కెప్టెన్‌ల జాబితాలో ఎంఎస్‌ ధోనీ పేరు ముందుంటుంది. సుదీర్ఘ కాలం పాటు మహీ, చెన్నైసూపర్‌ కింగ్స్‌(CSK)ను ముందుండి నడిపించాడు. అత్యధిక ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచిన టీమ్‌గానూ నిలిపాడు. ఎక్కువ సార్లు ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ చేరిన జట్టుగా కూడా సీఎస్కే రికార్డు క్రియేట్‌ చేసింది. ఇదే సమయంలో సీఎస్కేకు ధోనీ మారుపేరులా మారిపోయాడు. అయితే ప్రారంభంలో సీఎస్కే కెప్టెన్‌గా ధోనీని ఎంపిక చేయలేదని? మరో ప్లేయర్‌ను పరిశీలించారని మీకు తెలుసా?

మాజీ సీఎస్కే ప్లేయర్​ సుబ్రమణియన్ బద్రీనాథ్ ఈ విషయాన్ని తెలిపారు. మహీ బాధ్యతలు చేపట్టడానికి ముందు వీరేంద్ర సెహ్వాగ్‌ను కెప్టెన్‌గా చేయాలని ఫ్రాంచైజీ భావించిందట. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

  • సీఎస్కే కెప్టెన్సీ ప్లాన్‌ వేరు
    2008లో ఐపీఎల్‌ మొదటి సీజన్‌కు ముందు తమ జట్టును సమర్థంగా నడిపించే, ప్రజల్లో పాపులర్‌ అయిన ప్లేయర్‌ కోసం సీఎస్కే వెతికింది. టీమ్‌ ఇండియా స్టార్‌ ఓపెనర్‌, విధ్వంసకర బ్యాటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎంచుకుంది. దూకుడు, వ్యక్తిత్వంతో సెహ్వాగ్ మొదటి ప్రాధాన్యంగా మారాడు. అయినప్పటికీ, సెహ్వాగ్ దిల్లీ తరఫున డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడాడు. దిల్లీతో అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో సెహ్వాగ్‌ను సీఎస్కే కన్నా ముందు దిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్) సొంతం చేసుకుంది.
  • ఎంఎస్ ధోనీ ఎంపిక ఎలా జరిగింది?
    సెహ్వాగ్ దిల్లీతో ఉండాలని నిర్ణయించుకోవడంతో, సీఎస్కే ఫోకస్‌ ఎంఎస్‌ ధోనీవైపు మళ్లింది. మహీ, 2007 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించాడు. అతని ప్రశాంతత, పదునైన వ్యూహం, మ్యాచ్‌ను ముగించే సామర్థ్యం అందరినీ మెప్పించాయి. దీంతో సీఎస్కే ఫ్రాంచైజీ, ధోనీని కెప్టెన్‌గా ఎంచుకుంది. అనంతరం సీఎస్కే ఎన్ని అద్భుత ఫలితాలు అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్‌ హిస్టరీలో అత్యుత్తమ జట్టుగా సీఎస్కే నిలిచింది.

మహీ హయాంలో చెన్నై 5 టైటిల్స్‌ గెలిచింది. అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా ముంబయి ఇండియన్స్‌ సరసన నిలిచింది. చెన్నై మరో ఐదు సార్లు రన్నరప్‌గానూ నిలిచింది. 2024 సీజన్‌కు ముందు మహీ సీఎస్కే కెప్టెన్సీ వదులుకున్నాడు. అతడు 264 ఐపీఎల్‌ మ్యాచుల్లో 5243 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

  • సెహ్వాగ్ ఐపీఎల్ జర్నీ
    సెహ్వాగ్ సీఎస్కే కెప్టెన్‌గా లేనప్పటికీ, ఐపీఎల్‌పై అదరగొట్టాడు. దిల్లీ డేర్‌డెవిల్స్‌, కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)కు ప్రాతినిధ్యం వహించాడు. తనదైన శైలిలో జట్టుకు అద్భుతమైన ఆరంభాలు ఇచ్చాడు. సెహ్వాగ్‌ ఐపీఎల్‌లో మొత్తం 104 మ్యాచ్‌లు ఆడాడు. ఏకంగా 2728 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.
  • 2025 ఐపీఎల్‌లో ధోని ఆడనున్నాడా?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ధోనీ ఆడతాడా? లేదా? అనేది ప్రస్తుతం అనేక మంది మదిలో మెదిలే ప్రశ్న. అయితే వచ్చే సీజన్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ రూల్‌నే పక్కన పెట్టేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అన్‌క్యాప్‌డ్‌ రిటెన్షన్ రూల్‌ అనే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా తీసుకునేందుకు సీఎస్‌కే మొగ్గు చూపిస్తోందని ప్రచారం జరుగుతోంది.

కోహ్లీని కలిసిన రాధిక శరత్​ కుమార్​ - ఎందుకంటే? - Radikaa Sarathkumar Kohli

ముందు ధోనీనే, నేను కాదు- నా కొడుకు నన్ను అలా మోటివేట్ చేశాడు - Piyush Chawla UPL 2024

ABOUT THE AUTHOR

...view details