MS Dhoni Dance Video Viral : క్రికెట్ స్టేడియంలో తన ఆటతో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోనీ. తన బ్యాట్‌తో చాలా మంది క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాడు. కీపింగ్ మాయాజాలంతో ఆకట్టుకోవడంతో పాటు అద్భుతమైన నాయకత్వంతో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.
అయితే ఇప్పుడు తనలోని మరో టాలెంట్‌ను బయటకు తీశాడు మహీ. తాజాగా తన డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. ఓ వేడుకలో తన భార్య సాక్షితో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాగా, గత కొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలసి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నాడు ధోనీ. ఈ క్రమంలోనే రిషికేష్‌లోని స్థానికులతో కలసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు మహీ. పహాడీ, గులాబీ షరారా అనే జానపద పాటలకు స్థానికులతో కలసి ధోనీ-సాక్షి దంపతులు చిందులేశారు. వీరిద్దరూ ట్యూన్స్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ చేసి ఆకట్టుకోవడం విశేషం.
ఈ వేడుకలో స్థానికులంతా అక్కడి సంప్రదాయ దుస్తులు ధరించారు. ధోనీ దంపతులు సాధారణ దుస్తుల్లోనే కనిపించారు. వీరిద్దరు చేతులు పట్టుకొని బాణీకి తగ్గట్లుగా కాళ్లు కదుపుతూ అలరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.