Morne Morkel Team India :టీమ్ఇండియాకు శిక్షణ ఇచ్చేందుకుకొత్త బౌలింగ్ కోచ్‌ను అపాయింట్ చేసింది మేనేజ్మెంట్. ఇందుకుగానూ సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా తాజాగా ఓ న్యూస్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు మోర్కెల్ కాంట్రాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుందని, ఈ నేపథ్యంలో సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌తో మోర్నీ మోర్కెల్ కోచ్‌గా తన జర్నీని మొదలు పెట్టనున్నాడని క్రికెట్ వర్గాల మాట.
ఇక ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మోర్కెల్ మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. వీరిద్దరూ గతంలో కలిసి ఆడిన సందర్భాలు ఉన్నాయి. 2014 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గంభీర్ సారథ్యంలో టైటిల్ సాధించింది. అప్పుడు మోర్నీ మోర్కెల్ కేకేఆర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
ఇదిలా ఉండగా, గంభీర్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్‌గా ఉన్న సమయంలో మోర్కెల్ ఆ జట్టుకు బౌలింగ్ కోచ్‌గానూ బాధ్యతలు చేపట్టాడు. దీంతో పాటు మోర్కెల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కోచ్‌గా పనిచేసిన ఎక్స్‌పీరియెన్స్ కూడా ఉంది. పాకిస్థాన్ జట్టుకు కూడా అతడు కొంతకాలంపాటు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.