తెలంగాణ

telangana

ETV Bharat / sports

బిగ్​బాస్​ బ్యూటీతో సిరాజ్! - లైక్ కొడితే ప్రేమలో పడినట్టేనా? - MOHAMMED SIRAJ LOVE RELATIONSHIP

బిగ్​బాస్​ బ్యూటీ మహిరా శర్మతో క్రికెటర్​ సిరాజ్ లవ్​లో ఉన్నట్లు ప్రచారం - ఫ్యాన్స్ ఏం అంటున్నారంటే?

Mohammed Siraj Bigg Boss Mahira Sharma
Mohammed Siraj Bigg Boss Mahira Sharma (thumbnail source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Nov 27, 2024, 6:51 AM IST

Mohammed Siraj Bigg Boss Mahira Sharma :క్రికెటర్లు సినీ తారలతో ప్రేమాయణం నడపడం వంటి సందర్భాలు చాలానే చూస్తుంటాం. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సహా పలు జంటలే ఇందుకు ఉదాహరణ. అయితే వీటిలో కొన్ని ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్తే, మరికొన్ని డేటింగ్​తో ఫుల్ స్టాప్​ పెడుతుంటాయి. అయితే ఇప్పుడు సోషల్​ మీడియాలో మరో కొత్త జంట పుట్టిందంటూ వచ్చిన రూమర్ తెగ ట్రెండింగ్ అవుతోంది. టీమ్ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మతో లింక్​లు పెడుతూ నెట్టింట వార్తలు దర్శనమిస్తున్నాయి.

వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ అవుతున్నాయి. కనీసం వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఎక్కడా కనిపించకపోయినా, ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం, పోస్టులకు లైకులు కొట్టడం వంటివి చేయడంతో ఈ రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఫాలో అయి, లైక్​ కొడితే దానికే రూమర్స్ అల్లేస్తారా? అంటూ సిరాజ్ ఫ్యాన్స్ ప్రశ్నలు వేస్తున్నారు.

కాగా, మహిరా శర్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్​గా ఉంటారు. అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. రీసెంట్​గా కూడా ఆమె తన ఇన్​స్టా హ్యాండిల్​లో కొన్ని అదిరే పిక్స్ షేర్ చేశారు. ఇందులో ఆమె దేశీ ఔట్ ఫిట్​లో బ్యాక్ లెస్ టాప్ వేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. అలానే కేక్​ పట్టుకుని కూడా గ్లామర్​గా పోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షించాయి.

ఇకపోతే ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్​లో ఉన్నప్పుడు పరాస్ ఛబ్రాతో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచారు. ఈ షో తర్వాత వీరిద్దరికి బ్రేకప్ అయింది. ఇక ఇప్పుడు సిరాజ్​తో మహిరా క్లోజ్​గా ఉంటుందంటూ వార్తలు గుప్పుమన్నాయి.

మహ్మద్ సిరాజ్ విషయానికొస్తే, ప్రస్తుతం అతడు బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. తొలి టెస్ట్​లో ఆస్ట్రేలియా జట్టుపై టీమ్ ఇండియా 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో సిరాజ్ కూడా కీలకంగానే వ్యవహరించాడు. మొదటి టెస్టులో మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు దక్కించుకున్నాడు.

వేలంలో కావ్య మారన్​ మార్క్ సెలెక్షన్ - పవర్​ఫుల్​గా సన్​రైజర్స్ టీమ్​​

IPL 2025 - అన్ని జట్ల ప్లేయర్ల పూర్తి లిస్ట్ ఇదే - ఎవరి కోసం ఎంత ఖర్చు పెట్టారంటే?

ABOUT THE AUTHOR

...view details