తెలంగాణ

telangana

ETV Bharat / sports

షమీ, ఆస్ట్రేలియా వెళ్లడం కష్టమే? - ఇక ఆ రెండు టోర్నీలే లక్ష్యం! - MOHAMMED SHAMI VS AUS

ప్రస్తుతం డొమెస్టిక్‌ క్రికెట్‌లో రాణిస్తున్న షమీ ఫిట్​నెస్​, అతడి గాయం తీవ్రత ఎలా ఉందంటే?

Mohammed Shami
Mohammed Shami (Source Getty Images)

By ETV Bharat Sports Team

Published : Dec 13, 2024, 9:45 PM IST

Mohammed Shami Fitness : టీమ్ ఇండియా, 2025 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో రెండో టెస్ట్‌ ఘోరంగా ఓడిపోవడంతో కీలక పాయింట్లు కోల్పోయింది. సిరీస్‌లో మిగిలున్న మూడు టెస్టులు టీమ్‌ఇండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో తదుపరి టెస్టులకు జట్టులో కీలక మార్పులు ఉంటాయని అందరూ ఆశించారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకుని డొమెస్టిక్‌ క్రికెట్‌లో అదరగొడుతున్న షమీ టీమ్‌లోకి వస్తాడని భావించారు.

Mohammed Shami VS AUS :ఆస్ట్రేలియా - భారత్‌ మధ్య మూడో టెస్టు డిసెంబరు 14న శనివారం నుంచి మొదలవుతుంది. అలాగే స్టార్ పేసర్ షమీ ఇప్పటికే ఆస్ట్రేలియాలో అడుగు పెట్టాల్సింది. కానీ అతడి మోకాలిలో వాపు కనిపించినట్లు మేనేజ్‌మెంట్ తెలిపింది. డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడుతున్నప్పటికీ, షమీ ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించలేదని సమాచారం.

ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో షమీ 9 మ్యాచ్‌లు ఆడాడు. 7.85 ఎకానమీతో మొత్తం 11 వికెట్లు తీశాడు. ఓ మ్యాచ్‌లో 17 బంతుల్లోనే 32 పరుగులు చేసి అదరగొట్టాడు. బెంగాల్ క్వార్టర్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. మోకాలిలో వాపు వచ్చినట్లు తెలిసినా, షమీ 4 ఓవర్లు వేయడానికి పెద్దగా ఇబ్బంది పడట్లేదు.

టార్గెట్‌ ఆ మెగా టోర్నీలే

అయితే ఆస్ట్రేలియాతో కనీసం చివరి రెండు టెస్టుల్లోనైనా షమీ ఆడుతాడని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. షమీ కూడా ఆసీస్‌ వెళ్లే అంశాన్ని పక్కన పెట్టేశాడట! 2025 ప్రారంభంలో జరగబోయే ఛాంపియన్స్‌ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌ లక్ష్యంగా షమీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. గాయం కారణంగా షమీ 2024 ఐపీఎల్‌ ఆడలేకపోయాడు. రాబోయే సీజన్‌ కోసం షమీని సన్‌రైజర్స్ ఏకంగా రూ.10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

షమీ వ్యవహారంపై బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ - "షమీ మోకాలి గాయం కారణంగా వాపు వస్తూ పోతోంది. ఆస్ట్రేలియా వెళ్లడం కష్టమే. డిసెంబర్ 21 నుంచి మొదలయ్యే విజయ్‌ హజారే ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడాలని షమీ భావిస్తున్నాడు. ఇప్పుడు అతడి కెరీర్‌ చివరి దశలో ఉంది. ఆస్ట్రేలియా వెళ్లి లాంగ్ స్పెల్‌లు వేయడం కష్టం. దీంతో టెస్టుకు బదులు లిమిటెడ్ ఓవర్ల క్రికెట్‌ ఆడాలని షమీ నిర్ణయించుకున్నా తప్పుబట్టేందుకు లేదు" అని పేర్కొన్నాయి.

ద్రవిడ్ చిన్న కొడుకు తొలి సెంచరీ!

పాకిస్థాన్ స్టార్ ఆల్​రౌండర్ షాకింగ్ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details