Mohammed Shami Surgery Update:టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ తన గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. రీసెంట్గా సర్జరీ కుట్లు తీసేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. 'అందరికీ నమస్తే! నా రికవరీ గురించి అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నా. నాకు సర్జరీ పూర్తై 15 రోజులు అయ్యింది. తాజాగా ఆ కుట్లను తొలగించారు. గాయం నుంచి కోలుకోవడంలో పురోగతి సాధిస్తున్నాందుకు సంతోషిస్తున్నా. ట్రీట్మెంట్లో తదుపరి దశ కోసం ఎదురుచూస్తున్నా' అని ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేశాడు.
కాగా 2023 వరల్డ్‌కప్ సమయంలోనే షమీ కాలి మడమకు గాయమైంది. అయినప్పటికీ షమీ నొప్పితోనే ఆ టోర్నీలో పాల్గొన్నాడు. ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడం వల్ల షమీ ఆటకు దూరమయ్యాడు. వరుసగా 2023 డిసెంబర్లో సౌతాఫ్రికా పర్యటన, 2024 జనవరిలో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్, రీసెంట్గా ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్ షమీ దూరమయ్యాడు. ఇక గతనెల చివరి వారంలో షమీకి సర్జరీ జరిగింది. అప్పట్నుంచి షమీ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. తాజాగా సర్జరీకి సంబంధించిన కుట్లు తొలగించినట్లు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.
మోదీ స్పెషల్ ట్వీట్:ఇక షమీ సర్జరీ పట్ల ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల స్పందించారు. 'మీరు త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మీలో ఉన్న ధైర్యంతో ఈ గాయం బారిన నుంచి త్వరగా కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది' అని సర్జరీ గురించి షమీ తెలిపిన రోజే మోదీ ట్వీట్ చేశారు. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో షమీ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతడు మొత్తం టోర్నీలో 24 వికెట్లు పడగొట్టి, లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.