Mohammed Shami Champions Trophy 2025 :టీమ్ఇండియా అభిమానులకు గుడ్ న్యూస్. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు జరిగే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. 2023 నవంబరులో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ తర్వాత జట్టుకు దూరంగా షమీ ఇంగ్లండ్‌తో సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
వైద్య బృందం పర్యవేక్షణలో
కుడి మడమకు శస్త్రచికిత్స చేయించుకున్న షమీని నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని సమాచారం. మడమ గాయం నయమైనా, మోకాలిలో స్వల్ప వాపు ఉండటం వల్లే బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి అతడ్ని ఎంపిక చేయలేదట. షమీ పూర్తిగా గాయం నుంచి కోలుకుంటే ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే జట్టులో అతడికి చోటు దక్కనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) వైద్య బృందం నిశిత పరిశీలనలో షమీ ఉన్నాడు. షమీతో నిత్యం ఒక ఎన్సీఏ ఫిజియో లేదా ట్రైనర్ ఉంటున్నారట. రాజ్‌కోట్‌లో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఆడినప్పుడు కూడా షమీతో ఫిజియో వెళ్లారట.