తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ ఓటమితో బరిలో దిగిన షమీ- బ్యాండేజీతోనే నెట్స్​లో ప్రాక్టీస్- వీడియో వైరల్

బెంగళూరు ఎన్​సీఏ కోలుకుంటున్న పేసర్ షమీ- మరోసారి నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్

Mohammed Shami Comeback
Mohammed Shami Comeback (Source: Getty Images)

By ETV Bharat Sports Team

Published : Oct 20, 2024, 5:14 PM IST

Mohammed Shami Comeback :టీమ్ఇండియా ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్. స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొకాలి గాయంతో ఎన్​సీఏలో కోలుకుంటున్న షమీ కమ్​బ్యాక్​పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. కివీస్​తో టెస్టు మ్యాచ్​ మధ్యలో నెట్స్​లో కనిపించాడు. తాజాగా మరోసారి షమీ నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

బెంగళూరు వేదికగా ఆదివారం న్యూజిలాండ్​పై భారత్ ఓడిన తర్వాత, అదే గ్రౌండ్​లో షమీ నెట్స్​లో ప్రాక్టీస్​కు దిగాడు. టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్, కోచ్ అభిషేక్ నాయర్​కు షమీ కాసేపు బౌలింగ్ చేశాడు. అయితే తన ఎడమ కాలికి ధరించిన బ్యాండేజీతోనే షమీ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అంటే ఇంకా ఫిజియోల పర్యవేక్షనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ షమీ ఫిట్​గా ఉన్నట్లుగానే బంతులేశాడు. దీంతో త్వరలోనే షమీని టీమ్ఇండియాలో చూడవచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక తాజా అప్డేట్ ప్రకారం షమీ మరో నాలుగు వారాల్లోపే పూర్తిగా కోలుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన నవంబర్​లో ప్రారంభమయ్యే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పేస్‌కు అనుకూలంగా ఉండే ఆసీస్‌ పిచ్‌లపై షమీ కీలక పాత్ర పోషిస్తాడని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌తోపాటు షమీ కూడా జట్టులో ఉంటే పేస్ ఎటాక్‌ మరింత బలంగా ఉండనుంది.

అయితే టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వాలంటే డొమెస్టిక్ టోర్నీల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని నిబంధన ఉంది. మరి షమీ దేశవాళిలో ఆడతాడా? లేదా నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తాడా అన్నది బీసీసీఐ నిర్ణయించాల్సి ఉంటుంది.

కాగా, గతేడాది జరిగిన వన్డే వరల్డ్​కప్​లో షమీ గాయపడ్డాడు. అప్పట్నుంచి క్రికెట్​కు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్, టీ20 వరల్డ్​కప్​ టోర్నీకి కూడా షమీ అందుబాటులో లేడు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ అస్ట్రేలియా టూర్​తో షమీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details