Mens Asia Cup 2025:2025 ఆసియా కప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఆయితే ఈసారి టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ ప్రిపేర్ చేసే ఆలోచనలో ఉందట. గతంలోనూ 2016, 2022లో రెండుసార్లు టీ20 ఫార్మాట్లోనే జరిగింది. దీంతో ఈసారి కూడా పొట్టి ఫార్మాట్లోనే నిర్వహించాలని ఏసీసీ భావిస్తోందట. అయితే గతేడాది 2023 మాత్రం వన్డే ఫార్మాట్లో జరిగింది. ఆ ఎడిషన్‌లో భారత్ విజేతగా నిలిచింది.
ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటాయి. భారత్ సహా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నేరుగా అర్హత సాధిస్తాయి. ఇక ఆరో జట్టు క్వాలిఫయర్ రౌండ్ ద్వారా ఎంపికవుతుంది. ఇందులో నేపాల్, హాంకాంక్, యూఏఈ మధ్యలో క్వాలిఫయర్ ఉండనుంది. ఇక ఏసీసీ, వచ్చే ఎడిషన్ కోసం స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్ పార్ట్నర్లను ఇప్పటికే ఆహ్వానించిదట. కాగా, మ్యాచ్‌ల నిర్వహణ కోసం స్టేడియాలపై ఓ క్లారిటీ ఇస్తే, ఏసీసీ ఆసియా కప్ షెడ్యూల్ ప్లాన్ చేయనుంది.
ఆ నెలలోనే!
అయితే వచ్చే ఏడాది టీమ్ఇండియా వరుస సిరీస్‌లతో బిజీగా ఉండనుంది. జనవరి- ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, ఫిబ్రవరి- మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆ తర్వాత ఏప్రి- మేలో ఐపీఎల్ ఉండనుంది. ఇక టీమ్ఇండియా జూన్- ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. తర్వాత సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ సిరీస్ ఉంది. అందుకే 2025 ఆసియా కప్‌ను అక్టోబర్ నెలలో నిర్వహించాలని ఏసీసీ ప్లాన్ చేస్తుంది. కాగా, 2027 ఆసియా కప్ మాత్రం మళ్లీ వన్డే ఫార్మాట్లోకే మారిపోనుంది. ఈ ఎడిషన్‌కు బంగ్లాందేశ్ ఆతిథ్యమివ్వనుంది.