ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో గర్భిణికి నొప్పులు - సిబ్బంది, మహిళా ప్రయాణికుల సహకారంతో.. - WOMAN DELIVERED ON RTC BUS

తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం - పురుడు పోసి మానవత్వం చాటుకున్న తోటి మహిళా ప్రయాణికులు - తల్లీబిడ్డలు క్షేమం

Woman Deliver in RTC Bus
woman delivered in RTC Bus in Gadwal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2025, 9:00 PM IST

woman delivered in RTC Bus in Gadwal : ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి తోటి మహిళా ప్రయాణికులు సాయం చేసి పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో కేటి దొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామానికి చెందిన మరియమ్మకు కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని బావి దొడ్డి గ్రామానికి చెందిన నరేశ్​తో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో మరియమ్మ గర్భిణి కాగా ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు రాయచూర్​ నుంచి గద్వాల్​కు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సు ఎక్కారు.

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం - పురుడు పోసిన తోటి మహిళా ప్రయాణికులు - తల్లీబిడ్డా క్షేమం (ETV Bharat)

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో మరియమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్​కు చెప్పి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ఈ క్రమంలో మరియమ్మకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో బస్సులోనే మహిళలందరూ కలిసి ఆమెకు పురుడు పోశారు. సాటి మహిళా ప్రయాణికుల సాయం చేసి ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆర్టీసీ సిబ్బంది 108 అంబులెన్స్​లోని వారిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. దీంతో తల్లీబిడ్డలు క్షేమం ఉన్నారు.

2024లో ఓ మహిళ కూడా బస్సులోనే ప్రసవం : గతంలోనూ ఈ తరహా ఘటనలు ఆర్టీసీ బస్సులో జరిగాయి. 2024 జులైలో ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్, తోటి మహిళా ప్రయాణికుల సాయంతో పురుడు పోశారు. దీనికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్​, ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ వారిని అభినందించారు. సామాజిక సేవలో ఆర్టీసీ సిబ్బంది ఉండటం అభినందనీయం అని మంత్రి పొన్నం కితాబు ఇవ్వగా టీజీఎస్​ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ మహిళ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్​ అభినందించారు. మహిళ కండక్టర్​తోపాటు తోటి మహిళ ప్రయాణికులు కూడా సాయం చేసి సాధారణ ప్రసవం చేశారని ఎక్స్ వేదికగా మెచ్చుకున్నారు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ- పండంటి బిడ్డకు జన్మ- ఇద్దరూ సేఫ్ - Woman Gave Birth To Baby In Bus

'ఆ నలుగురు!'.. ప్రాణం నిలిపిన అంబులెన్స్​ డ్రైవర్లు.. జీవం పోసిన కానిస్టేబుళ్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.