Manu Bhaker Neeraj Chopra:పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ చోప్రా మధ్య సంభాషణ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. పతకాల విజేతలు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. మనుతో నీరజ్ సరదగా మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. నీరజ్ ఏదో చెబుతుండగా మను క్యూట్‌గా నవ్వుతూ అలాగే అన్నట్లు తల ఊపడంతో ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
నిమిషాల్లోనే వీడియో వైరల్ అవ్వడం వల్ల నెటిజన్లు కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. 'వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది', 'ఫ్యూచర్ ఇండియన్ అథ్లెట్ కపుల్', 'బెస్ట్ కపుల్', 'నీరజ్ సిగ్గుపడుతున్నాడు' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక 'వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్', 'మెడల్ విన్నర్స్ ఇంట్రెస్టింగ్ టాక్' అని మరికొన్ని కామెంట్స్ వచ్చాయి.
మను అమ్మతో స్పెషల్ టాక్
ఇదిలా ఉండగా మను బాకర్ తల్లి సుమేధా బాకర్ కూడా నీరజ్‌తో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. పారిస్‌లో సిల్వర్ సాధించిన నీరజ్‌ను మను తల్లి అభినందించింది. ఆమె మాట్లాడుతుంటే నీరజ్ శ్రద్దగా విన్నాడు. ఈ క్రమంలో నీరజ్ చేయి తీసుకోని సుమేధా ఏదో ప్రామిస్ అడిగినట్లు తన తలపై వేసుకుంది. దీంతో 'అసలు ఏం జరుగుతోంది' కన్ఫ్యూజ్లో ఉన్నామంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. అయితే వాళ్ల మధ్య సంభాషణ గురించి ఎలాంటి క్లారిటీ లేదు.