Love Proposal In Paris Olympics 2024 :సాధారణంగా ప్రేమలో ఉన్న ప్రతీ జంట తమ లైఫ్‌లో ఓ డ్రీమీ ప్రపోజల్ ఉంటే బాగున్ను అని అనుకుంటుంటారు. ప్రియుడు, లేదా ప్రేయసి ఇలా ఎవ్వరో ఒకరు తమ అభిరుచులు, సౌకర్యానికి తగ్గట్లుగా ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేసుకుని తమ ప్రియమైన వారికి సర్ప్రైజ్ ఇస్తుంటారు. లైఫ్‌టైమ్ మెమరీలను క్రియేట్ చేస్తుంటారు. అయితే ఓ క్రీడాకారుడు మాత్రం తనకిష్టమైన ప్రదేశంలో ప్రేయసికి ప్రపోజ్ చేసేందుకు దాదాపు తొమ్మిదేళ్లు వెయిట్ చేశాడు. తాజాగా ఆ మూమెంట్‌ను నిజం చేసి నెట్టింట వైరలయ్యాడు. ప్రేమకు నెలవైన పారిస్‌లో ఆ డ్రీమీ ప్రపోజల్ ఎలా సాగిందంటే?
ఆ ఈవెంట్లోనే చూపులు కలిశాయి
అర్జెంటీనాకు చెందిన హ్యాండ్‌బాల్ స్టార్ పాబ్లో సిమోనెట్, మహిళల ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి మరియా పిలార్ కామ్పోయ్ లవ్ స్టోరీ దాదాపు 9 ఏళ్ల క్రితం మొదలైంది. 2015లో ఓ క్రీడా ఈవెంట్లో తొలిసారి కలుసుకున్నారు ఈ ఇద్దరూ. తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. నెమ్మదిగా వీళ్ల స్నేహం కాస్త ప్రేమబంధంగా మారింది. అయితే కొంతకాలం తర్వాత తమ ప్రేమను సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసిన ఈ జంట, 2016 రియో ఒలింపిక్స్‌లో తమ తమ క్రీడల్లో పాల్గొని సత్తా చాటారు.
ఆ తర్వాత ఇప్పుడు ఈ జంటకు పారిస్ ఒలింపిక్స్‌లో మరోసారి కలిసి పాల్గొనే అవకాశం దక్కింది. దీంతో ప్రేమకు చిహ్నమైన ఈ నగరంలో తన ప్రేయసికి తన మనసులోని ప్రేమను తెలపాలనుకున్నాడు. అయితే ఈ క్షణం కోసం అతడు ఏకంగా తొమ్మిదేళ్ల పాటు ఎదురుచూశాడు. ఇటీవలే ఆ కల నిజమవ్వడంతో మన హీరో ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. ప్రపోజల్ అందుకున్న హీరోయిన్ కూడా సంతోంషంతో ఉప్పొంగిపోతోంది.