ETV Bharat / sports

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ - ఫైనల్‌కు చేరిన భారత్ - Asian Champions Trophy Hockey

author img

By ETV Bharat Sports Team

Published : Sep 16, 2024, 5:19 PM IST

Updated : Sep 16, 2024, 5:28 PM IST

Asian Champions Trophy India Hockey : ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఫైనల్​కు దూసుకెళ్లింది.

source  IANS Photo
Asian Champions Trophy India Hockey (source IANS Photo)

Asian Champions Trophy India Hockey : ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తాజాగా ఫైనల్​కు దూసుకెళ్లింది. లీగ్ దశలో దూకుడు ప్రదర్శనతో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత జట్టు సెమీస్​లో దక్షిణా కొరియా జట్టును 4-1 తేడాతో ఓడించింది. హర్మన్‌ప్రీత్‌ సేన 4-1 తేడాతో కొరియాపై విజయం సాధించింది. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్ రెండు, ఉత్తమ్‌ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ చెరో గోల్ చేశారు. కొరియా తరఫున ఏకైక గోల్‌ను జిహున్‌ యంగ్‌ చేశాడు.

ఇకపోతే టోర్నీలో మూడుసార్లు ఛాంపియన్‌గా అవతరించిన పాకిస్థాన్‌ జట్టుకు మరో సెమీస్‌లో చైనా గట్టి షాక్‌ ఇచ్చింది. మొదట మ్యాచ్‌ 1-1తో టై అయింది. దీంతో షూటౌట్‌ నిర్వహించగా, ఇందులో చైనా 2-0తో పాకిస్థాన్​ను ఓడించింది. టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న చైనా ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Last Updated : Sep 16, 2024, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.