IND vs BAN Test Series : స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమ్ ఇండియా సన్నద్ధమవుతోంది. టెస్టు సిరీస్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. అలాగే బంగ్లాదేశ్ కూడా భారత్ లాంటి అగ్రశ్రేణి జట్టును ఓడించి సిరీస్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే అదీ అంత తెలికైన విషయం కాదు. భారత్ లాంటి జట్టును స్వదేశంలో బంగ్లా ఎదుర్కొవాలంటే టెక్నిక్ ఒక్కటే సరిపోదు. సరైన వ్యూహాలు కూడా ఉండాలి. ఈ క్రమంలో టీమ్ ఇండియా నుంచి బంగ్లా జట్టు ఎదుర్కొనబోయే 3 సవాళ్లు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
1. స్పిన్ త్రయం
రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్ త్రయంతో టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం బలంగా ఉంది. వీరి బౌలింగ్‌ను ఎదుర్కొని క్రీజులో నిలబడడం ప్రత్యర్థులకు అంత సులువు కాదు. జడేజా టైట్ లైన్స్‌పై బంతులు వేసి బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అశ్విన్ తన స్పిన్ మాయాజాలం, కుల్దీప్ మణికట్టు మంత్రంలో బంగ్లా ఆటగాళ్లను తిప్పేసే అవకాశాలు ఉన్నాయి.
బంగ్లా బ్యాటర్లు ఈ టీమ్ ఇండియా స్పిన్ త్రయాన్ని ఎదుర్కోవడం సవాల్ అనే చెప్పాలి. అందుకు ఫుట్ వర్క్ పై దృష్టిసారించాలి. స్వదేశంలో సిరీస్ కాబట్టి టీమ్ ఇండియా స్పిన్నర్లు మరింత చెలరేగే అవకాశం ఉంది. ఈ బౌలర్లను ఎదుర్కొనేందుకు బంగ్లా జట్టు దూకుడుగా ఆడే ప్రయత్నం చేయవచ్చు. ఏదీ ఏమైనా బంగ్లాదేశ్ మంచి వ్యూహాలతో బ్యాటింగ్‌తో వస్తేనే ఈ సిరీస్‌లో స్పిన్ త్రయాన్ని ఎదుర్కోవచ్చు.
Preps in full swing here in Chennai! 🙌
— BCCI (@BCCI) September 14, 2024
Inching closer to the #INDvBAN Test opener ⏳#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/F9Dcq0AyHi
2. కోహ్లీ, రోహిత్ బ్యాటింగ్
టీమ్ ఇండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో ఒక్కరు ఫామ్‌లో ఉన్న మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తారు. స్వదేశంలో వీరిని కట్టడి చేయడం బంగ్లా బౌలర్లకు కాస్త సవాల్‌తో కూడుకున్న పనే. కోహ్లీ టెక్నిక్, రోహిత్ స్ట్రోక్ ప్లేతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. ఈ దిగ్గజాలను ఔట్ చేయడానికి బంగ్లా బలమైన వ్యూహాలతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అలాగే కోహ్లీ, రోహిత్ బలహీనతను పసికట్టి దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.
బంగ్లాదేశ్ బౌలర్లు ప్రారంభ ఓవర్లలో టీమ్ ఇండియా వికెట్లను తీయాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రోహిత్, కోహ్లీకి బౌలింగ్ చేసే సమయంలో బంగ్లా బౌలర్లు ఒత్తిడికి గురికావొచ్చు. వీరిద్దర్ని త్వరగా ఔట్ చేస్తే కొంతమేర బంగ్లా జట్టు సఫలమైనట్లే. ఎందుకంటే వీరిద్దరిలో ఎవరు క్రీజులో ఉన్నా టీమ్ ఇండియా భారీ స్కోరు చేస్తుంది.
— BCCI (@BCCI) September 13, 2024
3. జస్ప్రీత్ బుమ్రా
టీమ్ ఇండియా యార్కర్ స్పెషలిస్ట్ బుమ్రా రూపంలో బంగ్లా జట్టుకు మరో సవాల్ ఎదురవ్వనుంది. బుమ్రా తన బౌలింగ్‌లో బంతితో ఆఫ్, లైగ్ సైడ్ రెండు వైపులా స్వింగ్ చేయగలడు. అందుకే బంగ్లా జట్టు ప్రారంభ ఓవర్లలో బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొవడం కాస్త కష్టమే. ఒకవేళ ఎదుర్కొని నిలబడినా పరుగులు కోసం శ్రమించాల్సి ఉంటుంది. అలాగే బుమ్రా తన బౌలింగ్‌లో స్వింగ్ కాకుండా, యార్కర్లు, బౌన్సర్లు వేసి బంగ్లా బౌలర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. టీమ్ ఇండియా విసిరే 3 సవాళ్లను అధిగమించాలంటే బంగ్లా జట్టుకు కేవలం శ్రమిస్తే సరిపోదు. సరైన వ్యూహాలు అమలు చేయాలి. అలాగే ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండాలి.
రెండు టెస్టులు, మూడు టీ20లు
కాగా, భారత పర్యటనకు బంగ్లాదేశ్ రానుంది. చెన్నై వేదికగా సెప్టెంబరు 19 నుంచి 23 వరకు భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. సెప్టెంబరు 27- అక్టోబరు 1 వరకు రెండో టెస్టులో ఇరుజట్లు తలపడనున్నాయి. అక్టోబరు 6 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం అవ్వనుంది.
కాలర్ పట్టుకుని ట్రక్ డ్రైవర్‌తో గంభీర్ గొడవ! - అసలేం జరిగిందంటే? - Gambhir Fight with Truck Driver