ETV Bharat / spiritual

ఆ రాశి వారికి ఈరోజు అనుకోని సమస్యలు! ఇష్ట దేవతారాధన మేలు! - Horoscope Today 17th September 2024 - HOROSCOPE TODAY 17TH SEPTEMBER 2024

Horoscope Today 17th September 2024 : 2024 సెప్టెంబర్ 17వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2024, 5:01 AM IST

Horoscope Today 17th September 2024 : 2024 సెప్టెంబర్ 17వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఇంటా బయటా అన్ని పనుల్లో అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. సామాజిక సేవ, పరోపకార పనులు చేయడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు అసైన్మెంట్లు మొదలు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగులు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. సహోద్యోగుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ఊహించని ప్రమోషన్లు లభించడం వల్ల ఆనందంగా ఉంటారు. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులకు, శుభకార్యాలకు శ్రీకారం చుట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వృత్తి నిపుణులకు వృత్తిపరంగా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. మీ పై అధికారులు మీ పనిపట్ల అసంతృప్తిగా ఉంటారు. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. అన్ని రంగాల వారు చేసే ప్రతిపనిలోను ఆచి తూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు కూడదు. కాలం కలిసి రానప్పుడు మౌనంగా, ప్రశాంతంగా ఉండడం మేలు. ప్రశాంతంగా ఉండండి. మంచికాలం ముందు వుంది. ముఖ్యమైన పనులు, వైద్య సంబంధమైన పనులు వాయిదా వేయడం మంచిది. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగే పనులు చేయకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నవగ్రహ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారు ఈ రోజు ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండడం అవసరం. సమయానుకూలంగా నడుచుకోండి. కోపం అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే అనుకోని సమస్యలు, అపార్థాలూ, కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ, అనవసరమైన వివాదాలు రావచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయంతో మీ మీరు చేసే అన్ని పనులూ సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. మీ ధైర్యమే మీ బలం. అదే ఈ రోజు మీకు విశేషమైన గుర్తింపు తీసుకు వస్తుంది. ప్రభుత్వవిషయాలకు సంబంధించిన, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాకుమెంట్లు చూడడానికి మంచి రోజు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఆంజనేయ స్వామి ధ్యానం శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయాలతో పాటు ఆదాయంలో కూడా వృద్ధి ఉంటుంది. చర్చల్లో, వాదనల్లో, మీ ఆలోచనా విధానం ఇతరులను ప్రభావితం చేస్తుంది. ఇది మీలో సంతోషాన్ని సంతృప్తిని నింపుతుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. స్థిరాస్తి రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. గణపతి ఆరాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ రోజు చక్కని అదృష్టం, సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ పని మీ ఉన్నతాధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. సామాజిక గుర్తింపు, పదోన్నతి లభించే సూచనలున్నాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అదృష్టం వరించి ఆరోగ్యం, సంపద, సంతోషం, ఇలా అన్నీ ఒక్కసారిగా కలిసి వస్తాయి. ఇంటి వాతావరణంలో సమన్వయ ధోరణి ఉంటుంది. రోజంతా చురుగ్గా వ్యవహరిస్తారు. ఉద్యోగస్థులకు సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. ఆర్థిక లాభం సూచితం. ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం అద్భుతంగా ఉంది. ఈ రోజు ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. షేర్లులో పెట్టిన పెట్టుబడులు ద్వారా గొప్ప లాభాలు పొందుతారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఊహించని అదృష్టాన్ని అందుకోబోతున్నారు. ఏకాగ్రతతో పనిచేసి బ్రహ్మాండమైన విజయాలను సాధిస్తారు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అత్యంత శుభకరంగా ఉంటుంది. ఈ రాశివారికి ఈ రోజు మొత్తం ఆనందం, ఉత్సాహంతో నిండి ఉంటుంది. అన్ని రంగాల వారు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పనిచేసి అద్భుతాలు సృష్టిస్తారు. అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేసారు. నూతన వస్త్రాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశముంది. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రాశివారికి ఈ రోజు ఆస్తి వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం చేకూరుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రియమైనవారితో వివాదాలు, మనస్పర్థలకు అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.