ETV Bharat / sports

కాలర్ పట్టుకుని ట్రక్ డ్రైవర్​తో గంభీర్ గొడవ! - అసలేం జరిగిందంటే? - Gambhir Fight with Truck Driver

Gambhir Fight with Truck Driver : టీమ్ ఇండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ ట్రక్కు డ్రైవర్​తో గొడవపడ్డాడట. కాలర్ పట్టుకుని మరీ వివాదానికి దిగాడట. అసలేం జరిగిందంటే?

source Getty Images and ETV Bharat
Gambhir (source Getty Images and ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 16, 2024, 3:31 PM IST

Gambhir Fight with Truck Driver : తన కెరీర్​లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్​లు ఆడి వార్తల్లో నిలిచిన టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వివాదాలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. మెంటార్​గా ఉన్న సమయంలోనూ పలు కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచాడు. అయితే తాజాగా గంభీర్ గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పంచుకున్నాడు. రోడ్డుపై ట్రక్ డ్రైవర్​తో గంభీర్ గొడవ పడిన సంఘటన గురించి ఓ పాడ్‌ కాస్ట్​లో చెప్పాడు. గంభీర్​కు త్వరగా కోపం వస్తుందని, అలాగే లోతైన భావోద్వేగంతో ఉంటాడని తెలిపాడు. ఇంకా గౌతీ గురించి ఏమన్నాడంటే?

"ఒకప్పుడు దిల్లీలో గౌతమ్ గంభీర్ ట్రక్ డ్రైవర్​తో గొడవపడ్డాడు. కారులో నుంచి దిగి, ట్రక్ పైకి ఎక్కి డ్రైవర్ కాలర్ పట్టుకున్నాడు. ట్రక్ డ్రైవర్ రాంగ్ టర్న్ చేశాడు. అంతేగాక గంభీర్​ను దుర్భాషలాడాడు. దీంతో గంభీర్​కు కోపం వచ్చి అలా చేశాడు. గంభీర్ కాస్త సీరియస్​గా ఉంటాడు. కానీ ఎన్నో పరుగులు చేశాడు. బాధ్యతలను భుజాలపై వేసుకుని ఎప్పుడూ ఆడతాడు. నేను, గంభీర్ మంచి స్నేహితులం కాదు. ఎందుకంటే ఇద్దరం దిల్లీ తరఫున ఆడేటప్పుడు ఓపెనర్ స్థానం కోసం తీవ్రంగా పోటీ పడేవాళ్లం." అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

'మంచి స్నేహితులం కాదు'
ఆకాశ్ చోప్రా, గంభీర్ ఇద్దరూ దేశవాళీ క్రికెట్​లో దిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ దిల్లీ, టీమ్ ఇండియాలో ఓపెనింగ్ స్థానం కోసం తీవ్రంగా పోటీపడేవారు. దీంతో గంభీర్, తాను మంచి స్నేహితులం కాలేకపోయామని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు. గంభీర్, తాను కలిసి ఆడే సమయంలో దిల్లీ జట్టు చాలా బలంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. టీమ్ ఇండియా దిగ్గజ ప్లేయర్లు కోహ్లీ, ధావన్​లలో ఒకరి మాత్రమే జట్టులో అవకాశం వచ్చేదని వివరించాడు. వీరేంద్ర సెహ్వాగ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వస్తే, ధావన్ లేదా కోహ్లీని మూడో ప్లేస్ లో బ్యాటింగ్ పంపేవాళ్లమని వెల్లడించాడు.

గంభీర్ విషయానికొస్తే
ఇక గంభీర్ విషయానికొస్తే టీమ్ ఇండియా ప్రధాన కోచ్​గా ఉన్నాడు. శ్రీలంక పర్యటనలో కోచింగ్ బాధ్యతలు అందుకున్న గంభీర్​కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. లంకపై టీ20 సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా, వన్డే సిరీస్​ను చేజార్చుకుంది. దీంతో సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్​తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ పై గంభీర్ దృష్టి సారించాడు. గంభీర్ కోచ్​గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే మొదటి టెస్ట్ సిరీస్ కావడం.

ఖరీదైన బ్యాట్​లు వాడుతున్న క్రికెటర్లు- ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! - Expensive Cricket Bats

ప్రాక్టీస్ సెషన్​లోనూ విరాట్ మార్క్- కొడితే గోడ బద్దలైంది! - Virat Kohli Practice Session

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.