తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్‌ చరిత్రలో 12 రోజులు జరిగిన టెస్ట్‌? ఫలితం ఏంటో తెలుసా? - Longest Test match in cricket

ఇప్పుడైతే టెస్ట్ మ్యాచ్​లు ఐదు రోజులు సాగేవి కానీ ఒకప్పుడు టెస్ట్‌లకు సమయ పరిమితి ఉండేది కాదు. అయితే మొట్ట మొదటి టెస్ట్‌ ఎప్పుడు జరిగింది? ఎక్కువ రోజులు జరిగిన టెస్ట్‌ ఏదో తెలుసా?

Longest Test match in cricket history
Longest Test match in cricket history (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Oct 6, 2024, 3:53 PM IST

Longest Test Match In Cricket History :ప్రస్తుతం అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఐదు రోజులు మాత్రమే జరుగుతాయని మనకు అందరికీ తెలిసిందే. ఈ ఐదు రోజుల్లోనే గెలుపు, ఓటమి లేదా డ్రా ఫలితం వస్తుంది. అయితే టెస్ట్‌ క్రికెట్‌ ప్రారంభంలో సమయ పరిమితి లేదు. మొట్ట మొదటి టెస్టు జరిగినప్పుడు అమల్లో ఉన్న నియమాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అంతేకాదు క్రికెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన టెస్ట్ మ్యాచ్ 12 రోజుల పాటు జరిగింది. ఇంత సుదీర్ఘ టెస్ట్‌ ఫలితం ఏంటో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు.

మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
క్రికెట్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌ 1877 మార్చి 15న ప్రారంభమైంది. అప్పట్లో టెస్ట్‌ క్రికెట్‌ నియమాలు భిన్నంగా ఉండేవి. ఇప్పటిలా టెస్ట్ మ్యాచ్‌కు టైమ్‌ లిమిట్‌ అనేది లేదు. నిర్ణీత సమయం అనేది లేదు, ఎన్ని రోజులు పట్టినా టెస్ట్‌ మ్యాచ్‌లో ఫలితం వచ్చే వరకు రెండు టీమ్‌లు రెండు ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది.

12 రోజులు జరిగిన ఇంగ్లాండ్‌- దక్షిణాఫ్రికా టెస్ట్‌
1939లో డర్బన్‌లో ఇంగ్లాండ్​, దక్షిణాఫ్రికా మధ్య అత్యంత సుదీర్ఘ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇదే చివరి 'టైమ్‌లెస్ టెస్ట్' మ్యాచ్‌. ఈ మ్యాచ్ 1939 మార్చి 3 నుంచి 14 వరకు 12 రోజుల పాటు జరిగింది. ఇందులో రెండు విశ్రాంతి రోజులు (మార్చి 5, 12) ఉన్నాయి. ఒక రోజు (మార్చి 11) మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు చేశారు. 43 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 1,981 పరుగులు నమోదయ్యాయి. 5,447 బాల్స్ బౌలింగ్‌ చేశారు.

సుదీర్ఘంగా పోరాడినా ఫలితం లేదు?
ఈ టెస్ట్ మ్యాచ్ 12 రోజుల పాటు జరిగినా, మ్యాచ్‌లో విజేత తేలలేదు. 12వ రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 654/5తో ఉంది. దక్షిణాఫ్రికాపై గెలవడానికి ఇంకా 42 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. వారు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారు. అప్పుడు ఊహించని సమస్య ఎదురుకావడంతో మ్యాచ్‌ని డ్రాగా ప్రకటించేందుకు రెండు జట్లు అంగీకరించాయి.

13వ రోజు మ్యాచ్‌ ఎందుకు జరగలేదు?
మ్యాచ్ 13వ రోజు వరకు వెళ్లవచ్చు. కానీ ఇంగ్లాండ్​ ఆటగాళ్లకు విచిత్రమైన సమస్య ఎదురైంది. వారు కేప్ టౌన్ ఓడరేవు నుంచి ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లాల్సిన ఓడకు సమయం అయింది. వేరే మార్గం లేకపోవడం వల్ల వారు ఆటను ముగించాల్సి వచ్చింది. దీంతో రెండు జట్లు మ్యాచ్‌ని డ్రాగా ముగించడానికి అంగీకరించాయి.

టెస్ట్ క్రికెట్​లో 'లంచ్'​​ - ఈ సమయంలో క్రికెటర్లు ఏం తింటారు? దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? - Lunch Break History In Test Cricket

టెస్టు క్రికెట్​లో అత్యధిక పార్ట్​నర్​షిప్​ నమోదు చేసిన జోడీలివే! - టాప్​లో ఎవరున్నారంటే? - Longest Partnership in Test Cricket

ABOUT THE AUTHOR

...view details