తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్ఇండియాలో ఈ క్రికెటర్లు వెరీ రిచ్ - వీరికి సొంత జెట్​లు కూడా! - Indian Cricketers Private Jet

Indian Cricketers Private Jet : అత్యంత ధనవంతులైన క్రికెటర్లు ఇండియాలో చాలా మంది ఉన్నారు. ఖరీదైన బంగ్లాలు, కార్‌లతో లగ్జరీగా జీవిస్తున్నారు. అంతే కాదు కొందరి వద్ద ప్రైవేట్‌ జెట్‌లు కూడా ఉన్నాయి. అవి ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకుందాం.

Indian Cricketers Private Jet
Indian Cricketers Private Jet (Source: Getty Images)

By ETV Bharat Sports Team

Published : Sep 5, 2024, 10:40 PM IST

Indian Cricketers Private Jet:భారతదేశంలో క్రికెట్‌ స్టార్‌ల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీసీసీఐ నుంచి శాలరీ, ఐపీఎల్‌ ఫీజులు, అడ్వర్టైజ్‌మెంట్లు, బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌లతో భారీగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో రిచెస్ట్‌ క్రికెటర్ల లిస్టులో తొలి మూడు స్థానాల్లో సచిన్ తెందూల్కర్‌, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ ఉన్నారు.

2024 మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విరాట్ కోహ్లీ దేశంలో అత్యధిక పన్ను చెల్లించిన క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లీ రూ.66 కోట్ల ట్యాక్స్‌ చెల్లించాడు. రెండో స్థానంలో ధోని (రూ.38 కోట్లు), మూడో స్థానంలో సచిన్ (రూ.28 కోట్లు) ఉన్నారు. తర్వాత గంగూలీ రూ.23 కోట్లు, పాండ్యా రూ.13 కోట్లు, పంత్ రూ.10 కోట్ల పన్ను చెల్లించారు. ఈ స్థాయిలో సంపాదన ఉన్న క్రికెటర్ల వద్ద ఖరీదైన బంగ్లాలు, కార్లు ఉన్నాయి. అయితే ప్రైవేట్‌ జెట్‌లు మాత్రం కొందరి దగ్గరే ఉన్నాయి. అవి ఎవరి వద్ద ఉన్నాయో తెలుసా?

విరాట్ కోహ్లీ :రన్ మెషీన్ విరాట్ కోహ్లీ చాలా కాలంగా టాప్‌ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఏటా సచిన్‌, ధోనీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అతని వద్ద ఖరీదైన కార్లు, ప్రైవేట్ జెట్ ఉన్నాయి. అతడి ప్రైవేట్ జెట్ విలువ రూ.120 కోట్లు.

హార్దిక్ పాండ్య :టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఆదాయం కూడా భారీగానే ఉంది. భారతదేశంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో హార్దిక్ ఒకడు. పాండ్యా వద్ద రూ.40 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది.

ఎంఎస్ ధోనీ: ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందజేసిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ప్రపంచంలోని రిచెస్ట్‌ క్రికెటర్ల జాబితాలో ధోని కూడా ఉన్నాడు. మహీ ప్రైవేట్ జెట్ విలువ రూ.110 కోట్లు.

సచిన్ తెందూల్కర్ :సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించి, క్రికెట్‌ గాడ్‌గా పేరు సంపాదించిన సచిన్ తెందూల్కర్‌ వద్ద కూడా ప్రైవేట్ జెట్‌ ఉంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో సచిన్‌ ఒకడు. సచిన్‌ ప్రైవేట్‌ జెట్‌ విలువ రూ.250 కోట్లు.

కపిల్ దేవ్ :కపిల్ దేవ్ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1983లో ఇండియాకి మొదటిసారి ప్రపంచ కప్‌ అందించాడు. స్వాతంత్య్రం తర్వాత ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిన మొదటి క్రికెటర్‌గా నిలచాడు. కపిల్ దేవ్ ప్రైవేట్ జెట్ విలువ రూ.110 కోట్లు.

గంభీర్ గ్యారేజీలో ఉన్న​ లగ్జరీ కార్లు ఇవే - అతడి నెట్​వర్త్​ ఎన్ని కోట్లో తెలుసా? - Gautam Gambhir Networth

రూ.120కోట్ల పర్స్​ వ్యాల్యూ- రిటెన్షన్ ఆప్షన్​లో మార్పు- IPL 2025 మెగా వేలం! - IPL 2025 Mega Auction

ABOUT THE AUTHOR

...view details