తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అందుకే పూరన్​కు పగ్గాలు'-రాహుల్ కెప్టెన్సీ ఇక అంతేనా! - KL Rahul Lucknow Captaincy - KL RAHUL LUCKNOW CAPTAINCY

KL Rahul Lucknow Captaincy : స్టార్ క్రికెటర్ కే.ఎల్‌.రాహుల్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. నిన్న (మార్చి 30న) పంజాబ్​, లఖ్​నవూ మధ్య జరిగిన పోరులో అతడి బదులు టాస్ వేసేందుకు నికోలస్‌ పూరన్‌ వచ్చాడు. దీంతో రాహుల్‌ కెప్టెన్సీ విషయంలో అభిమానులు కన్​ఫ్యూజన్ అవుతున్నారు. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదేమో అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని పనిభారాన్ని తగ్గించుకోవాలని రాహుల్ చూస్తున్నాడా అంటూ క్రికెట్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

KL Rahul Lucknow Captaincy
KL Rahul Lucknow Captaincy

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 12:12 PM IST

KL Rahul Lucknow Captaincy : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్, లఖ్​నవూ సూపర్ జెయింట్స్ సారథి కేఎల్​ రాహుల్ తాజాగా తీసుకున్ననిర్ణయం క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడికి బదులుగా అదే జట్టుకు చెందిన నికోలస్ పూరన్ టాస్‌కు వచ్చాడు. కెప్టెన్‌గా లేకున్నప్పటికీ, కేఎల్ రాహుల్ తుది జట్టులో ఉంటాడంటూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడతాడని పూరన్ చెప్పాడు. పనిభారం దృష్ట్యా రాహుల్‌కు విశ్రాంతి ఇచ్చామని, ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడతాడని తాత్కాలిక కెప్టెన్ నికోలస్ పూరన్ వెల్లడించాడు. అయితే ఇప్పుడు కేఎల్ రాహుల్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

గాయమే కారణమా ?
గాయం నుంచి నెమ్మదిగా కోలుకున్న కేఎల్ రాహుల్ ఫిట్​నెస్​ సాధించి ఐపీఎల్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇది సుదీర్ఘ టోర్నమెంట్‌ అని అతనికి విశ్రాంతి ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని పూరన్‌ తెలిపాడు. ఇది అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. రాజస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో KL రాహుల్ బ్యాటింగ్‌ చేసి వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించాడు.

ఇక రెండో మ్యాచ్‌లోనే రాహుల్‌కు విశ్రాంతి ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. టీ 20 ప్రపంచ కప్‌లో భారత జట్టు కీపర్‌గా ఎంపికవ్వాలని రాహుల్‌ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌ నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. లఖ్​నవూ జట్టులో క్వింటన్‌ డి కాక్, నికొలస్​ పూరన్‌ ఇద్దరు మంచి కీపర్‌లు ఉన్నారు. అయినా రాహుల్‌ కీపింగ్‌ చేస్తుండటం అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.

సీజన్‌ మొత్తానికి అతడేనా !
మరోవైపురాహుల్ స్థానంలో జట్టు పగ్గాలను నికోలస్ తీసుకోవడమనే నిర్ణయాన్ని లక్నో ఫ్రాంచైజీ తాత్కాలికంగా తీసుకుందా లేదంటే ఈ సీజన్ మొత్తానికా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ నిర్ణయం వెనకు మర్మం ఏంటనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ అనంతరమే పనిభారం గురించి రాహుల్ కెప్టెన్సీని వదులుకున్నాడంటే, అసలు అతను ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదేమో అనే సందేహాలు మొదలయ్యాయి.

గత ఐపీఎల్ సీజన్‌లో గాయపడి కొన్ని నెలల పాటు ఆటకు దూరమైన రాహుల్‌ ఆసియాకప్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనలో పాల్గొన్నాడు.కానీ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తిరిగి గాయపడ్డాడు. తొలి టెస్టు అనంతరం ఆటకు దూరమయ్యాడు.

ఇప్పుడు తిరిగి ఐపీఎల్‌లో పునరాగమనం చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. కానీ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. అయితే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని పనిభారాన్ని తగ్గించుకోవాలని రాహుల్ చూస్తున్నాడా? లేదా పూర్తి ఫిట్‌నెస్ సాధించముందే ఐపీఎల్ ఆడుతున్నాడా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఐపీఎల్‌లో నయా స్టార్ - బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఎవరీ మయాంక్ యాదవ్? - Who is Mayank Yadav

500 క్లబ్‌లోకి సునీల్ నరైన్ - ఈ సీజన్‌లో తొలి జట్టుగా కోల్‌కతా ఘనత - IPL 2024 RCB VS KKR

ABOUT THE AUTHOR

...view details