తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టాండ్స్​లోకి వచ్చిన 'బాల్'​ తిరిగివ్వనన్న 'ఫ్యాన్'- అంతా నవ్వులే నవ్వులు! - IPL 2024 - IPL 2024

KKR Fan Ball Steal: 2024 ఐపీఎల్​లో రీసెంట్​గా ముంబయి- కోల్​కతా మ్యాచ్​లో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. స్టాండ్స్​లోకి వచ్చిన బంతిని అందుకున్న ఓ ప్రేక్షకుడు తిరిగివ్వడానికి ఇష్టపడలేదు.

KKR Fan Ball Steal
KKR Fan Ball Steal (Source: Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 3:30 PM IST

Updated : May 14, 2024, 3:37 PM IST

KKR Fan Ball Steal:2024 ఐపీఎల్​లో ఇటీవల (మే 11) జరిగిన ముంబయి ఇండియన్స్- కోల్​కతా నైట్​రైడర్స్ మ్యాచ్​ ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్​ 9వ ఓవర్లో పీయుశ్ చావ్లా వేసిన బంతిని రస్సెల్ భారీ సిక్స్​ బాదాడు. బంతి నేరుగా స్టాండ్స్​లోకి వెళ్లింది. అయితే ప్రేక్షకుల్లో ఉన్న ఓ కేకేఆర్ ఫ్యాన్ ఆ బంతిని అందుకున్నాడు. బంతిని ఎలాగైనా తన దగ్గరే ఉంచుకోవాలని ప్లాన్ వేశాడు. ఎవరికి కనిపించకుండా బంతిని దాచేశాడు. దీంతో ఫీల్డర్లు బంతి కోసం ఎదురుచూస్తు ఉండిపోయారు.

ఇక ఎంతసేపటికీ బంతి తిరిగి రాకపోవడం వల్ల పోలీసులు స్టాండ్స్​లోకి వచ్చారు. చివరికి ఓ పోలీసు అధికారి ఆ యువకుడి నుంచి బంతిని రికవరీ చేసుకోని తిరిగి మైదానంలోకి పంపించాడు. దీంతో కాసేపు మ్యాచ్ నిలిచిపోయింది. ఈ సీన్ అంతా ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ యువకుడు చేసిన పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. 'ఫన్నీ బాయ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే యువకుడి నుంచి బంతి రికవరీ చేసుకునే సందర్భంలో పోలీసు అతడితో కాస్త దురుసుగా ప్రవర్తించాడు. 'పోలీసు ఆ యువకుడితో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది' అని వీడియో చూసిన నెటిజన్లు అంటున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, వర్షం ఆటంకం కలిగించడం వల్ల ఆటను 16 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16 ఓవర్లలో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (42 పరుగులు, 23 బంతుల్లో), నితీశ్ రానా (33 పరుగులు, 23 బంతుల్లో) రాణించారు. అనంతరం ఛేదనలో ముంబయి 16 ఓవర్లకు 8 వికెట్లకు 139 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, రసెల్‌, హర్షిత్ రానా తలో 2, నరైన్ 1 వికెట్ దక్కించుకున్నారు. కోల్​కతా 18 పరుగుల తేడాతో ఈ సీజన్​లో తొమ్మిదో విజయం నమోదు చేసింది. దీంతో ప్రస్తుత ఎడిషన్​లో అధికారికంగా ప్లేఆఫ్స్​కు చేరిన జట్టుగా నిలిచింది.

అక్షర్ పోరాటం వృథా - ఆర్సీబీ ఖాతాలో మరో సూపర్ విక్టరీ - IPL 2024

నరైన్ అరుదైన ఫీట్- మూడో ప్లేయర్​గా ఘనత- మ్యాచ్​లో నమోదైన రికార్డులు - IPL 2024

Last Updated : May 14, 2024, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details