Kelvin Kiptum Death:మారథాన్ ప్రపంచ రికార్డ్ విజేత కెల్విన్ కిప్తమ్ (kelvin kiptum dead) మరణించారు. కెన్యాలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో కిప్తమ్తో పాటు ఆయన కోచ్ గెర్వైస్ హకిజిమానా మృతిచెందారు. మరో మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని మరో క్రీడాకారుడు మిల్కా చెమోస్ ధ్రువీకరించారు. ఈ ప్రమాదం పశ్చిమ కెన్యాలోని ఎల్డోరెట్-కప్తగట్ పట్టణాల మధ్య రహదారిపై అర్ధరాత్రి 11 గంటలకు జరిగింది.
24 ఏళ్లకే సూపర్ స్టార్
24ఏళ్ల వయసున్న కిప్తమ్ మారథాన్‌లో సూపర్ స్టార్‌గా అవతరించారు. మారథాన్‌ను కేవలం 2గంటల నిమిషంలోపు పరుగెత్తిన మొదటి వ్యక్తిగా రికార్డు (kelvin kiptum record) సృష్టించారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన మారథాన్‌లో కేవలం 2:00.35 నిమిషాలలోపే పూర్తి చేశారు. దీంతో అప్పటివరకు ఉన్న కెన్యా ఎలియర్ కిప్చోగ్ను అధిగమించారు. ఈ రికార్డును గత వారమే అంతర్జాతీయ ట్రాక్ ఫెడరేషన్ వరల్డ్ అథ్లెటిక్స్ ధ్రువీకరించింది. 2022లో వాలెన్సియాలో జరిగిన మారథాన్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక లండన్, చికాగో రేసులను గెలుచుకున్నారు. ఇక 2023 అక్టోబరులో జరిగిన మారథాన్‌లో మరో అరుదైన రికార్డు అందుతున్నాడు. చికాగో (Kelvin Kiptum Chicago Marathon)లో జరిగిన మారథాన్‌లో 26.1 మైళ్లు (42 కి.మీ)ను కిప్టమ్ 2 గంటల 35 సెకన్లలో పూర్తి చేసి, తమ దేశానికే చెందిన అథ్లెట్ ఎలియుడ్ కిప్‌చోగ్ రికార్డు బద్దలుకొట్టాడు.