Kavya Maran SRH :ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విజయానికి సమీపంగా వచ్చిన సన్‌రైజర్స్ దురదృష్టవశాత్తు ఆ గెలుపును అందుకోలేకపోయింది. క్షణక్షణానికి ఇరు జట్ల మధ్య విజయం దోబుచూలాడింది. సన్‌రైజర్స్ ఫలితంలానే సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ కావ్య మారన్ రియాక్షన్ కూడా క్షణాల్లో మారిపోయింది.
తండ్రి కళానిధి మారన్‌తో కలిసి ఈ మ్యాచ్‌కు హాజరైన కావ్య మారన్, మ్యాచ్ జరుగుతున్నంత సేపు కెమెరాకు కనబడకుండా జాగ్రత్త పడింది. ఓ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి ఉండగా ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ క్లాసెన్ పోరాటంతో విజయానికి ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమయ్యాయి. హర్షిత్ రాణా వేసిన చివరి ఓవర్‌లో తొలి బంతినే హెన్రీచ్ క్లాసెన్ భారీ సిక్సర్ బాదాడు. దీంతో విజయం ఖాయమని కావ్యా సహా అంతా భావించారు.
రెండో బంతికి క్లాసెన్ సింగిల్ తీయగా, మూడో బంతికి షెహ్‌బాజ్ అహ్మద్ భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. నాలుగో బంతికి జాన్సన్ సింగిల్ తీస్తే, ఐదో బంతికి ఈసారి క్లాసెన్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అవడం వల్ల స్టేడియంలోని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోయారు. కావ్య అయితే బొమ్మలా ఉండిపోయింది. కేవలం 3 బంతుల్లో సీన్ మొత్తం మారిపోయింది.
చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది హైదరబాద్ జట్టు. దీంతో మ్యాచ్ ఓడిపోయింది. దెబ్బకి పాప ఆనందం ఆవిరైపోయింది. ముఖంపై నిరాశ, నిస్పృహ స్పష్టంగా కన్పించాయి. తొలి బంతికి సిక్స్ కొట్టడంతో గెలుపు ఖాయమని ఎగిరి గంతేసిన కావ్య ఆఖరి బంతి తర్వాత దు:ఖంలో మునిగిపోయింది. క్షణాల్లో ఆమెలో మారిన హావ భావాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి అనూహ్య పరిణామాలతో సన్‌రైజర్స్ ఓడిపోయింది.