Kagiso Rabada 300 Wickets :సౌతాఫ్రికా పేసర్ కగిసొ రబాడ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో 300 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. టెస్టు కెరీర్లో రబాడ 11,817 బంతుల్లోనే 300 వికెట్ల క్లబ్లో చేరాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ వికెట్‌తో రబాడ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ పేసర్ వకార్ యూనిస్ (12,602 బంతుల్లో)ను అధిగమించాడు.
కాగా, 2015లో టెస్టు అరంగేట్రం చేసిన రబాడ ఇప్పటివరకు 65 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 302 వికెట్లు పడగొట్టాడు. అటు బ్యాటింగ్‌లో 932 పరుగులు చేశాడు.
అతితక్కువ బంతుల్లో 300వికెట్లు తీసిన బౌలర్లు
- కగిసో రబడ (సౌతాఫ్రికా )*-11817 బంతులు
- వకార్ యూనిస్ (పాకిస్థాన్)-12602 బంతులు
- డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా )- 12605 బంతులు
- అలెన్ డొనాల్డ్ (సౌతాఫ్రికా )-13672 బంతులు
స్ట్రైక్ రేట్లో రబాడనే టాప్
టెస్టుల్లో 300 వికెట్లను ఇప్పటివరకు 38 మంది తీశారు. అయితే అందరిలో మెరుగైన స్ట్రైక్ రేట్ రబాడనే సాధించాడు. రబాడ స్ట్రైక్ రేట్ 39.3. అతని తర్వాతి స్థానంలో ఉన్న డేల్ స్టెయిన్ 42.3. వీరిద్దరూ సౌతాఫ్రికా బౌలర్లే కావడం గమనార్హం. అంటే టెస్టుల్లో రబాడ ప్రతి 39 బంతులకు సగటున ఒక్క వికెట్ పడగొడుతున్నాడు.