Jaydev Unadkat Ipl Teams:2024 ఐపీఎల్‌లో స్టార్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అతడు సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 47 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఉనాద్కత్ ఓ వింత ఘనత సాధించాడు. తన కెరీర్లో ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఎనిమిది ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో అత్యధిక ఫ్రాంచైజీలు మారిన తొలి భారత క్రికెటర్‌గా ఉనాద్కత్ రికార్డు కొట్టాడు.
ఐపీఎల్‌లో ఉనద్కత్ ప్రయాణం అసాధారణంగా సాగింది. 2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఉనాద్కత్ అప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల అతడు ఆయా జట్ల తరఫున ఆడాడు. కేకేఆర్ నుంచి ఉనాద్కత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మారాడు. ఆ తర్వాత వరుసగా దిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పటి దిల్లీ క్యాపిటల్స్), మళ్లీ కోల్‌కతా, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్, ముంబయి ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలకు మారాడు. ఈ క్రమంలో గడిచిన 14 సీజన్లో ఉనాద్కత్ 8 ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.