Jasprit Bumrah IND Vs AUS : భారత కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా పరిస్థితిపై అభిమానుల్లో అయోమయం నెలకొంది. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా, బుమ్రా మైదానం వీడాడు. మెడికల్ సిబ్బందితో కలిసి అతడు స్కానింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఒకవేళ గాయం ఉన్నట్లు తేలితే టీమ్‌ఇండియా ఇబ్బందుల్లో పడ్డట్లే అని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. కానీ స్కానింగ్‌లో ఎటువంటి ఇబ్బంది లేదని వస్తే మాత్రం అభిమానులకు ఊరట కలగడం ఖాయమని అంటున్నారు.
టీమ్ డాక్టర్‌తో మైదానం వీడిన బుమ్రా - గాయం వల్లేనా? - JASPRIT BUMRAH IND VS AUS
టీమ్ డాక్టర్‌తో మైదానం వీడిన బుమ్రా - ఏమైందంటే?
![టీమ్ డాక్టర్‌తో మైదానం వీడిన బుమ్రా - గాయం వల్లేనా? Jasprit Bumrah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-01-2025/1200-675-23252532-thumbnail-16x9-bumrah.jpg)
Jasprit Bumrah (Associated Press)
Published : Jan 4, 2025, 9:28 AM IST
సిరీస్ విజేతగా తేల్చే మ్యాచ్‌లో బుమ్రా ఆడకపోతే మాత్రం కష్టమమవుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. బుమ్రా గైర్హాజరీలో విరాట్ కోహ్లీకి జట్టును నడిపించే బాధ్యతను మేనేజ్‌మెంట్ అప్పగించింది.