Jasprit Bumrah ICC Champions Trophy 2025 :దాయాది దేశం పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. టోర్నీకి సంబంధించి గత నెలలోనే షెడ్యూల్ విడుదలైంది. అయితే టీమ్ఇండియా అభిమానులకు తాజాగా ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లకు భారత పేసర్ జస్ర్పీత్ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చని క్రీడా వర్గాల్లో చర్చలు జరుగుతోంది.
అసలేం జరిగిందంటే?
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో జస్ర్పీత్ బుమ్రా అదరగొట్టాడు. అయితే, ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో వెన్ను నొప్పితో బౌలింగ్ కు దూరం అయ్యాడు. ఆ తర్వాత అతడి గాయంపై పలు వార్తలు వచ్చాయి. అయితే బుమ్రా మార్చి మొదటి వారానికికల్లా గాయం నుంచి కోలుకోవచ్చని తెలుస్తోంది. అప్పటికి 100శాతం ఫిట్నెస్ సాధించాడని పలు కథనాలు వెల్లడిస్తున్నాయి.
బుమ్రా గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో అతడి పేరును 15 మందితో కూడిన జట్టులో ఉంచాలా? లేదంటే రిజర్వు ఆటగాళ్లలో ఉంచాలా? అన్న విషయాన్ని సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం బుమ్రా బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. మార్చి మొదటి వారానికి బుమ్రా ఫిట్ నెస్ సాధిస్తాడని భావిస్తున్నారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా సెలక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.