తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రాపై ఆసీస్​ కెప్టెన్ ప్రశంసలు - 'టెస్టు కెప్టెన్‌గా అతడే బెస్ట్' - JASPRIT BUMRAH BGT

టెస్టు కెప్టెన్‌గా బుమ్రానే బెస్ట్ ఆప్షన్‌ : ఆసీస్ మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్

Jasprit Bumrah Border-Gavaskar Trophy
Jasprit Bumrah (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Dec 21, 2024, 3:39 PM IST

Jasprit Bumrah Border-Gavaskar Trophy : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్ ఎంతో ఉత్కంఠంగా సాగుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమ్‌ఇండియా 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే అడిలైడ్‌లో పింక్-బాల్ మ్యాచ్​కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమిని చవి చూసింది. ఇక బ్రిస్బేన్‌లో జరిగిన మూడో మ్యాచ్‌కు వర్షం అంతరాయం వల్ల భారత్‌ డ్రాతో గట్టెక్కింది. కానీ రోహిత్‌ అటు కెప్టెన్​గానూ ఇటు బ్యాటర్‌గానూ విఫలమవుతున్నాడు. దీంతో ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో అతను రాణించకపోతే మాత్రం టెస్టుల్లో కెప్టెన్సీకి గుడ్ బై చెబుతాడంటూ మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీమ్‌ఇండియాకు బుమ్రా అద్భుతమైన కెప్టెన్సీ ఆప్షన్‌ అవుతాడంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ వ్యాఖ్యానించాడు.

"బుమ్రా కెప్టెన్సీ చాలా బాగా చేస్తాడు. పెర్త్‌ టెస్టులో బుమ్రా తనను తాను సరిగ్గా ఉపయోగించుకున్నాడు. అయితే కెప్టెన్‌గా అతడు పర్‌పెక్ట్‌గా ఫీల్డింగ్ సెట్‌ చేశాడు. అతని బౌలింగ్‌ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. అతని మణికట్టు, బంతిని వదిలే స్థానం ఇతర బౌలర్లకు భిన్నంగా అనిపిస్తుంది. వంగి బౌలింగ్‌ చేయడం వల్ల ఇతర బౌలర్ల కంటే కాస్త ఆలస్యంగా బంతిని వదులుతున్నాడు. అయితే అతని రన్నప్‌ విభిన్నంగా ఉండటం వల్ల బుమ్రా బౌలింగ్‌లో బ్యాటర్లు ఇబ్బందిపడుతున్నారు" అని అలెన్ బోర్డర్ వివరించాడు.

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 445 పరుగులకు ఆలౌటవ్వగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా 252/9 స్కోరుతో నిలిచింది. ఈ క్రమంలో ఫాలో ఆన్‌ గండం నుంచి గట్టెక్కింది. అయినప్పటికీ ఆసీస్‌ కంటే 199 పరుగుల వెనుకంజలో టీమ్‌ఇండియా ఉండటం గమనార్హం.

ప్రస్తుతం క్రీజులో జస్‌ప్రీత్ బుమ్రా (10*), ఆకాశ్ దీప్ (21*) ఉన్నారు. అయితే వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఈ మ్యాచ్‌ను నిలిపేశారు. అంతకుముందు కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (77) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ముందుకు నడిపించారు. యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (3), రిషభ్‌ పంత్ (9), సిరాజ్ (1) మాత్రం తమ సింగిల్ డిజిట్‌ స్కోర్​తో జట్టును నిరాశపరిచారు. రోహిత్ శర్మ (10), నితీశ్‌కుమార్‌ రెడ్డి (16) పరుగులు స్కోర్ చేశారు. ఇక ఆసీస్‌ బౌలర్లలో పాట్ కమిన్స్ 4, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లైయన్ చెరో వికెట్ తీశారు.

టెస్ట్​ క్రికెట్​లో బుమ్రా తగ్గేదే లే! - 2024లో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌ 10 బౌలర్లు ఎవరంటే?

కపిల్ దేవ్​ను దాటేసిన బుమ్రా- ఏకైక భారత బౌలర్​గా రికార్డ్

ABOUT THE AUTHOR

...view details