Lowest Total In T20 History:టీ20 క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్ నమోదైంది. జపాన్- మంగోలియా (Japan vs Mangolia) మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్ నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ జట్టు 217 పరుగులు స్కోర్ చేసింది. దీంతో 218 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన మంగోలియా టీమ్ 8.2 ఓవర్లలోనే 12 పరుగులు చేసి కుప్పకూలింది.ఆ జట్టులో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు తమ పరుగుల ఖాతా తెరవకుండానే వరుసగా ఔటై పెవిలియన్ చేరారు. దీంతో ప్రస్తుతం జరిగిన ఈ ఇన్నింగ్స్ టీ20 హిస్టరీలోనే రెండో అత్యల్ప స్కోర్‌గా చరిత్రకెక్కింది.
కాగా, తొలిసారిగా ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు 2023 ఫిబ్రవరిలో స్పెయిన్ (Isle of Man's vs Spain)తో జరిగిన మ్యాచ్‌లో 8.4 ఓవర్లలో 10 పరుగులకే ఆలౌటైంది. ఇది టీ20 చరిత్రలో తొలి అత్యల్ప స్కోర్. ఇక ఓవర్ల పరంగా చూసుకుంటే ఇది రెండో అతి చిన్న ఇన్నింగ్స్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మంగోలియా ఇన్నింగ్స్ 8.2 ఓవర్లలోనే ముగిసింది. 2023లో నైజీరియా- రవాండ (Rwanda vs Nigeria) మ్యాచ్‌లో నమోదైంది. ఈ మ్యాచ్‌లో రవాండ 6.1 ఓవర్లలో 24 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక పరుగుల పరంగా టీ20 చరిత్రలో ఇది నాలుగో అతిపెద్ద విజయం. 2023 ఆసియా గేమ్స్‌లో ఇదే మంగోలియాపై నేపాల్ 273 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులుక కుప్పకూలింది.