తెలంగాణ

telangana

ETV Bharat / sports

చిరుతలా ధోనీ రన్నింగ్! - 2 సెకన్లలో 13 మీటర్లు పరుగెత్తి రనౌట్ - ఉసేన్ బోల్ట్​నే మించిపోయాడుగా! - MS DHONI VS USAIN BOLT

రన్నింగ్ దిగ్గజం ఉసేన్ బోల్ట్​ను తలదన్నేలా ధోనీ స్టంట్- 2 సెకన్లలో 13 మీటర్ల పరుగు

2016 T20 WORLD CUP MS Dhoni
MS Dhoni (Etv Bharat)

By ETV Bharat Sports Team

Published : Jan 21, 2025, 3:33 PM IST

MS Dhoni Vs Usain Bolt :టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫిట్​నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఫిట్​నెస్​తో బ్యాటింగ్, కీపింగ్ సమయంలో చిరుతలా పరుగెడుతుంటాడు. అందుకే ధోనీ కీపర్​గా బ్యాటర్లు క్రీజు బయట కాలు పెట్టాలన్నా, దగ్గర్లో బాల్ ఉన్నప్పుడూ రన్ తీయాలన్నా భయపడేవారు. అంతలా ధోనీ కీపింగ్​లో రాణించాడు.

అయితే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2016లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. టీమ్ ఇండియా, బంగ్లా జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ లో భారత మాజీ కెప్టెన్ ధోనీ తన అసాధారణ వేగంతో పరుగెత్తి బ్యాటర్​ను రనౌట్ చేశాడు. దీంతో మ్యాచ్ భారత్ వశమైంది.

అసలేం జరిగిందంటే?
ఆ మ్యాచ్​లో బంగ్లా విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం. భారత బౌలర్ హార్దిక్ పాండ్య వేసిన బంతి షాట్ మిస్ ధోనీ చేతికి వెళ్లింది. అటువంటి సమయంలో ధోనీ వేగంగా కదిలి బంగ్లా బ్యాటర్ ముస్తాఫిజర్ రెహమాన్​ను ఔట్​ చేశాడు. అందుకోసం తన గ్లవ్​ను ఒకదాన్ని పక్కన పెట్టాడు. బ్యాటర్​కు ధీటుగా కదిలి అతను ఔట్​ చేశాడు. దీంతో మ్యాచ్ టై కాకుండా టీమ్ ఇండియా విజయం సాధించింది.

2 సెకన్లలో 13 మీటర్ల పరుగు
అప్పుడు ధోనీ 13 మీటర్ల దూరాన్ని దాదాపు 2 సెకన్లలో పూర్తి చేశాడు. జమైకా పరుగుల వీరుడు, ఒలింపిక్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్​తో సమానంగా ధోనీ పరుగు తీసినట్లు లెక్కన్నమాట. అంత వేగంగా ధోనీ కీపింగ్ ప్లేస్ నుంచి వికెట్లు వైపు పరుగెత్తాడు. అయితే ధోనీ, ఉసేన్ బోల్ట్ రన్నింగ్ చేసిన సందర్భం వేరైనా వారిద్దరూ పరుగు తీయడంలో ఉద్దండులే అని అభిమానులు అభిప్రాయపడుతుంటారు. కాకపోతే బోల్ట్ సుదూర దూరానికి ఫాస్ట్​గా రన్నింగ్ చేయడంలో దిట్ట. ధోనీ కేవలం 13 మీటర్ల దూరంలో వేగంగా పరుగెత్తి రనౌట్ చేశాడు. అందుకే ఈ ఇద్దర్ని సరిపోల్చడం సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు.

కాగా, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత క్రికెట్​కు ఎనలేని సేవలు అందించాడు. అతడి కెప్టెన్సీలోనే భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. అలాగే టీమ్​ఇండియాను టెస్ట్ ర్యాంకింగ్స్​లో తొలిసారి అగ్రస్థానంలో నిలబెట్టింది కూడా ధోనీయే కావడం విశేషం. అంతలా భారత క్రికెట్​లో ధోనీ చెరగని ముద్ర వేశాడు. ఐపీఎల్​లోనూ ధోనీ సత్తా చాటాడు. తాను ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్​ను ఐదు సార్లు ఛాంపియన్​గా నిలిపాడు.

ధోనీ ఫ్యామిలీ టైమ్- పెంపుడు శునకంతో అలా- వీడియో వైరల్

'మంచి క్రికెట్ ఆడితే, ఎలాంటి ప్రమోషన్స్ అక్కర్లేదు'- సోషల్ మీడియాపై ధోనీ

ABOUT THE AUTHOR

...view details