తెలంగాణ

telangana

ETV Bharat / sports

రూ.1.3 లక్షల కోట్లకు పెరిగిన ఐపీఎల్ వ్యాల్యూ - టాప్​లో సీఎస్కే, ముంబయి డౌన్ - IPL Teams Brand value

IPL Teams Brand value : ఐపీఎల్‌ ప్రతి సీజన్‌కు తన బ్రాండ్ వ్యాల్యూ పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం చెన్నై టాప్‌లో ఉండగా, ముంబయి దారుణంగా పడిపోయింది. మిగతా ఫ్రాంచైజీల వ్యాల్యూ ఎలా ఉందంటే?

Source ANI
IPL Teams Brand value (Source ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 8:31 PM IST

IPL Teams Brand value :ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ హిస్టరీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్ ‌(CSK), ముంబయి ఇండియన్స్‌ (MI)ను పేర్కొంటారు. అయితే గత సీజన్‌లో రెండు టీమ్‌లు నిరాశ పరిచాయి. సీఎస్కే తృటిలో ప్లేఆఫ్స్‌ అవకాశం చేజార్చుకుంది. ముంబయి టోర్నీ నుంచి మొట్ట మొదట ఎలిమినేట్‌ అయిన జట్టుగా నిలిచింది. ఈ పెర్‌ఫార్మెన్స్‌తో సీఎస్కే బ్రాండ్‌ వ్యాల్యూకు వచ్చిన నష్టమేమీ లేదు. CSK గతేడాది కంటే 9% వృద్ధిని సాధించింది. 231 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.1930 కోట్లు) అత్యధిక బ్రాండ్ వ్యాల్యూ ఉన్న జట్టుగా నిలిచింది.

2024 ఐపీఎల్‌ సీజన్‌ సెకండ్‌ స్టేజ్‌లో వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా తన బ్రాండ్ వ్యాల్యూ తగ్గకుండా కాపాడుకుంది. ఆర్సీబీ (227 మిలియన్ డాలర్లు) రెండో స్థానంలో ఉంది. 2024 విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్రాండ్ వ్యాల్యూ ఏకంగా 19.30% పెరిగింది. కేకేఆర్ (216 మిలియన్‌ డాలర్లు)తో మూడో స్థానంలో నిలిచింది.

  • నాలుగో స్థానానికి పడిపోయిన ముంబయి

కొన్ని సీజన్లు నుంచి ముంబయి ఇండియన్స్‌ పెద్దగా రాణించడం లేదు. 2024లో ఏకంగా టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయిన ఫస్ట్‌ టీమ్‌గా నిలిచింది. సీజన్‌ ప్రారంభానికి ముందు అత్యధిక బ్రాండ్ వ్యాల్యూ కలిగి ఉన్న ముంబయి ఫ్రాంఛైజీ ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానాని(204 మిలియన్‌ డాలర్లు)కి చేరింది. ఈ సీజన్‌లో 14 మ్యాచుల్లో 4 మాత్రమే గెలిచి, పాయింట్స్‌ టేబుల్లో లాస్ట్‌ పొజిషన్‌లో నిలవడంతో బ్రాండ్‌ వ్యాల్యూ తగ్గింది. అంతేకాకుండా రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా తొలగించి హార్దిక్ పాండ్యను నియమించడం కూడా ప్రభావం చూపింది.

  • ఇతర టీమ్స్‌ బ్రాండ్‌ వ్యాల్యూ ఎంతంటే?
    ఐపీఎల్‌ 2024లో అద్భుతంగా రాణించి, ప్లేఆఫ్స్‌లో విఫలమైన రాజస్థాన్‌ రాయల్స్‌ బ్రాండ్‌ వ్యాల్యూ 133 మిలియన్‌ డాలర్లుగా ఉంది. ఆర్‌ఆర్‌ ఐదో స్థానంలో ఉంది. ఫైనల్లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యాల్యూ 132 మిలియన్‌ డాలర్లతో ఆరో స్థానానికి పరిమితం అయింది. దిల్లీ క్యాపిటల్స్‌ 131 మిలియన్‌ డాలర్లతో ఏడు, గుజరాత్ టైటాన్స్ 124 మిలియన్ డాలర్లతో ఎనిమిది, పంజాబ్ కింగ్స్ 101 మిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయి. బ్రాండ్‌ వ్యాల్యూ పరంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (91 మిలియన్ డాలర్లు) చివరి స్థానంలో ఉంది.

  • పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ
    ఐపీఎల్ బ్రాండ్ విలువ గతేడాది కంటే 6.3 శాతం (రూ.28,000 కోట్లు) పెరిగిందని హౌలిహాన్ లోకీ పేర్కొంది. గతేడాది ఈ మెగా టోర్నీ బ్రాండ్ విలువ 3.2 బిలియన్‌ డాలర్లు ఉండగా ఈ ఏడాది 3.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. వ్యాపార పరంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యాల్యూ 6.5 శాతం పెరిగి రూ.1.3 లక్షల కోట్లకు (16.4 బిలియన్‌ డాలర్లు) చేరింది.


    ఫ్లోరిడాలో భారీ వర్షాలు - పాకిస్థాన్ 'సూపర్ 8' ఆశలు ఆవిరి! - T20 world cup elimination

'ఆ పదం వింటేనే చిరాకొస్తుంది' - ఫెదరర్‌ చెప్పిన జీవిత పాఠాలు - Roger Federers Speech

ABOUT THE AUTHOR

...view details