IPL Mumbai Indian Records:ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో అత్యధిక స్కోర్ నమోదు చేసి రికార్డు సృష్టించింది. సీజన్ 17లో భాగంగా బుధవారం ముంబయి ఇండియన్స్‌తో తలపడ్డ సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 277-3 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ పేరిట ఉన్న పాత రికార్డు (263-5)ను బద్దలుకొట్టి కొత్త చరిత్ర రాసింది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ప్రత్యర్థి ముంబయి ఇండియన్స్ కూడా ఓ రికార్డు సాధించింది.
278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబయి ప్రయత్నిస్తే తప్పేం ఉంది అన్నట్లు మొదట్నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ గట్టి పునాది వేస్తే, దాన్ని తెలుగు తేజం తిలక్ వర్మ, నమన్ దీర్ కొనసాగించారు. ఒక దశలో ముంబయి గెలిచి చరిత్ర తిరగరాస్తుందేమో అనిపించింది. కానీ, ఆఖర్లో సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుతంగా పుంజుకొని ముంబయిని కట్టడి చేశారు. అయితే ఛేదనలో ముంబయి 20 ఓవర్లకు 246/5 స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఛేదనలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ముంబయి రికార్డు కొట్టింది.
అయితే ఐపీఎల్ హిస్టరీలోనే ఛేజింగ్‌లో టాప్ స్కోర్ బాదినా ముంబయికి ఈ మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఐపీఎల్లో ఛేజింగ్‌లో అత్యధిక స్కోర్లు (220+) బాదినప్పటికీ ఆయా జట్లు ఓడిన సందర్భాలు ఉన్నాయి. మరి అవేటంటే?