IPL 2025 Schedule :క్రీడాభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న తరుణం రానే వచ్చింది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పది జట్ల ప్రాంఛైజీలు తమ తమ సన్నాహకాల్లో బిజీగా ఉంది. ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన కొద్ది రోజుల్లోనే టీ20 లీగ్ అలరించనుంది. దీంతో అభిమానులు ఈ కొత్త సీజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న అంటే ఒక్కరోజు ముందుగానే 18వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం.
13 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించనుంది మేనేజ్మెంట్. ఓపెనింగ్ మ్యాచ్ కేకేఆర్ - ఆర్సీబీ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. కాగా, ఈ ఎడిషన్లో మొత్తం 65 రోజులకుగానూ 74 మ్యాచ్లు జరగనున్నాయి. మే 20న హైదరాబాద్ వేదికగా తొలి క్యాలిఫయర్ మ్యాచ్ జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుంది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మొత్తం 9మ్యాచ్లు జరగనుంది. అందులో 7లీగ్ మ్యాచ్లు కాగా, మిగతా రెండు ప్లే ఆఫ మ్యాచ్లు.