IPL Auction 2025 Teams Purse Value :ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల రిటెన్షన్ లిస్ట్‌లను గురువారం అధికారికంగా ప్రకటించాయి. మొత్తం 10 జట్లు 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. అందులో కోల్‌కతా, రాజస్థాన్ జట్లు గరిష్ఠంగా ఆరు రిటెన్షన్ల పూర్తి కోటాను ఉపయోగించుకున్నాయి. పంజాబ్ జట్టు తక్కువ సంఖ్యలో ఇద్దరిని మాత్రమే అట్టిపెట్టుకుంది. దీంతో పంజాబ్ వద్ద అన్ని జట్ట కంటే అత్యధికంగా రూ. 110.50 కోట్లు ఉన్నాయి. ఇక ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు సహా ఆరుగురిని రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ రూ.41 కోట్ల అతి తక్కువ పర్స్‌తో వేలంలోకి దిగనుంది. ఐపీఎల్ 2025 వేలంలో పాల్గొన్న ఫ్రాంచైజీల పర్స్ వ్యాల్యులు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL 2025 - టీమ్స్ పర్స్ వ్యాల్యూ
ఫ్రాంచైజీ | పర్స్ వ్యాల్యూ | ఆర్టీఎమ్ కార్డ్ |
పంజాబ్ కింగ్స్ | రూ. 110.5 కోట్లు | 4 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రూ. 83 కోట్లు | 3 |
దిల్లీ క్యాపిటల్స్ | రూ. 76.25 కోట్లు | 2 |
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ | రూ. 69 కోట్లు | 1 |
గుజరాత్ టైటాన్స్ | రూ. 69 కోట్లు | 1 |
చెన్నై సూపర్ కింగ్స్ | రూ. 55 కోట్లు | 0 |
కోల్‌కతా నైట్‌రైడర్స్ | రూ. 51 కోట్లు | 1 |
ముంబయి ఇండియన్స్ | రూ. 45 కోట్లు | 1 |
సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 45 కోట్లు | 1 |
రాజస్థాన్ రాయల్స్ | రూ. 41 కోట్లు | 0 |