తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2025 వితౌట్ వార్నర్​ - అప్పుడు రైనా విషయంలోనూ ఇలానే - బాధపడుతోన్న ఫ్యాన్స్ - DAVID WARNER UNSOLD IPL AUCTION

మెగా వేలంలో వార్నర్​కు నిరాశ - ఈ సారి అతడు​ లేకుండానే ఐపీఎల్ 2025

David Warner unsold IPL Auction
David Warner suresh raina (source ANI and Getty Images)

By ETV Bharat Sports Team

Published : Nov 26, 2024, 10:01 AM IST

David Warner unsold IPL Auction :ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా ఆక్షన్‌ రసవత్తరంగా సాగింది. రెండు రోజుల పాటు సాగిన ఈ ఐపీఎల్‌ వేలంలో కోట్లాభిషేకం కురిసింది. అయితే ఈ దఫా మెగా ఆక్షన్‌లో కొన్ని అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. స్టార్ ప్లేయర్లకు కొందరు అన్​సోల్డ్​గా మిగిలిపోవడం క్రికెట్ ఫ్యాన్స్​కు బాధ కలిగిస్తున్నాయి. వారిలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఒకడు. ఐపీఎల్​లో ఆల్ టైమ్ ఫెవరెట్, అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన డేవిడ్ వార్నర్ ఈ వేలం పాటలో అమ్ముడుపోలేదు.

ఐపీఎల్‌లో ఓ వెలుగు వెలిగి, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు ట్రోఫీ అందించాడు డేవిడ్ భాయ్. తన బ్యాటింగ్‌, కెప్టెన్సీతో జట్టుకు అపురూప విజయాలను అందించాడు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్ అయింది. గతంలో అతడి కోసం పోటీ పడిన ఫ్రాంఛైజీలు ఇప్పుడు అతడిపై మొహం చాటేశాయి. దీంతో వార్నర్​ ఫ్యాన్స్​తో పాటు క్రికెట్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Suresh Raina Unsold IPL : అయితే ఇలా జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇతర స్టార్ క్రికెటర్ల విషయంలోనూ ఇలానే జరిగింది. 2022 సీజన్​లో మిస్టర్ ఐపీఎల్​గా పేరు గాంచిన సురేశ్​ రైనా కూడా అన్​సోల్డ్​గా మిగిలిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అతడు ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అతడిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. కనీసం ముందుకు కూడా రాలేదు. దీంతో అప్పుడు ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ఇప్పుడు వార్నర్ విషయంలోనూ అదే జరగడంతో క్రికెట్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి ఫొటోలను జత చేసి తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

వార్నర్ రికార్డులివే - టీ 20 ఫార్మాట్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్​కు టన్నలు కొద్దీ పరుగులు చేసిన ఘతన ఉంది. అయినప్పటికీ ఎవరూ కూడా వార్నర్​ను తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో వార్నర్ ఐపీఎల్ కెరీర్ మరోసారి చర్చకొచ్చింది.

2009లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు వార్నర్​. అప్పటి నుంచి 2024 సీజన్ వరకూ కొనసాగుతూ వచ్చాడు. మధ్యలో 2018 సీజన్‌లో మాత్రమే అందుబాటులో లేడు. ఈ మెగా లీగ్​లో వార్నర్​ ఇప్పటి వరకు 184 మ్యాచ్ లు ఆడి 6,565 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా నాలుగు శతకాలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇందులో 663 ఫోర్లు, 236 సిక్స్​లతో పాటు 83 క్యాచ్​లు కూడా అందుకున్నాడు. 40.52 బ్యాటింగ్ యావరేజ్‌ రికార్డ్ కూడా ఉంది. 139.77 స్ట్రైక్‌రేట్‌ను స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు.

2019లో వార్నర్​ అత్యుత్తమ సగటు కూడా నెలకొల్పాడు. ఆ సీజన్​లో ఏకంగా 12 మ్యాచులు ఆడి 69.20 సగటుతో, 143.86 స్ట్రైక్ రేట్​తో 692 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ సీజన్​లోనే 57 ఫోర్లు 21 సిక్స్​లు కూడా బాదాడు.

టీ20 చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్​గానూ డేవిడ్ వార్నర్ నిలిచాడు. మూడు సీజన్స్ (2015, 17, 19) లో ఆరెంజ్ క్యాప్​ను ముద్దాడాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఘనత కూడా డేవిడ్ వార్నర్‌ది. 2016 సీజన్‌ ఫైనల్స్‌లో అతడి కేప్టెన్సీలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి కప్‌ను ముద్దాడింది ఎస్​ఆర్​హెచ్. ఆ ఫైనల్స్‌లో వార్నర్​ 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ సీజన్‌ మొత్తంగా 848 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు.

మరి ఇంతటి సూపర్ ట్రాక్ రికార్డ్ ఉన్న డేవిడ్ వార్నర్​ను తీసుకునేందుకు ఈ సారి ఎవరూ ఆసక్తి చూపించకపోవడం ఫ్యాన్స్​ను బాధ కలిగిస్తోంది. అయితే తీసుకోకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. 2024 సీజన్‌లో వార్నర్​ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. ఎనిమిది మ్యాచుల్లో కేవలం 168 పరుగులే చేశాడు. పైగా ఇప్పుడు అతడి వయస్సు 38. అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా వైదొలిగాడు. ఇలా పలు రకాల కారణాలు ఉన్నాయి.

IPL 2025 Auction Full Players List :కాగా, మొత్తంగా ఈ ఐపీఎల్ 2024 ఆక్షన్​లో 182 మంది క్రికెటర్లను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. 8 మందిని జట్లు ఆర్టీఎం చేసుకున్నాయి. అన్ని జట్లు కలిపి ఆటగాళ్ల కొనుగోళ్ల కోసం మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు పెట్టాయి.

IPL 2025 వేలం - 182 మంది క్రికెటర్స్​ సోల్డ్​​ - రూ.639.15 కోట్ల ఖర్చు

IPL 2025 - అన్నీ జట్ల ప్లేయర్ల పూర్తి లిస్ట్ ఇదే - ఎవరి కోసం ఎంత ఖర్చు పెట్టారంటే?

ABOUT THE AUTHOR

...view details