తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL టాప్ 10 వికెట్ల వీరులు వీరే - బ్యాటర్లను భయపెట్టేస్తారు! - ipl top 10 wicket takers

IPL Top 10 Wicket Takers : బ్యాటర్లు విధ్వంసం మాత్రమే ఉండే ఐపీఎల్‌లో బౌలర్లు సత్తా చాటి తాము ఎంత ముఖ్యమో చాటి చెప్పారు. ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్‌లో స్పిన్నర్లే ఎక్కువ వికెట్లు నేలకూల్చారు. అత్యధిక వికెట్లు తీసిన టాప్‌ టెన్‌ బౌలర్లు ఎవరో తెలుసుకుందాం.

IPL టాప్ 10  వికెట్ల వీరులు - ఈ బౌలర్స్​ వెరీ స్పెషల్!
IPL టాప్ 10 వికెట్ల వీరులు - ఈ బౌలర్స్​ వెరీ స్పెషల్!

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 2:19 PM IST

IPL Top 10 Wicket Takers : క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్‌ ఫీవ‌ర్ అమాంతం పెరిగిపోయింది. ఐపీఎల్‌ కోసం భారత్‌లో కాలుమోపుతున్న దిగ్గజ క్రికెటర్లంతా తమ ప్రాంచైజీ ఆటగాళ్లతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈసారి కచ్చితంగా కప్‌ ఎత్తుకెళ్లాలన్న కసితో వ్యూహాలు రచిస్తున్నారు. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే టోర్నీలో ఈసారి మరిన్ని రికార్డులు ఖాయంగా కనిపిస్తున్నాయి. అయితే బ్యాటర్ల విధ్వంసం కొనసాగుతున్నా బౌలర్లు తమ సత్తా చాటారు. ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్‌లో టాప్‌ టెన్‌ బౌలింగ్‌ ప్రదర్శనలను ఓసారి చూస్తొద్దాం పదండి.


యజ్వేంద్ర చాహల్‌ : ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 147 మ్యాచ్‌లు ఆడిన స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ 187 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను ముప్పు తిప్పలు పెట్టాడు. చాహల్‌ బెస్ట్‌ 40 పరుగులకు అయిదు వికెట్లు.

డ్వేన్‌ బ్రావో : ఐపీఎల్‌లో సందడి అంటే ఠక్కున గుర్తు వచ్చే పేరు డ్వేన్‌ బ్రావో. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 161 మ్యాచ్‌లు ఆడిన ఈ సీమర్‌ 183 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన వైవిధ్య బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించిన బ్రావో బెస్ట్‌ 22 పరుగులకు నాలుగు వికెట్లు.

పీయూష్‌ చావ్లా : సాంప్రదాయ స్పిన్‌తో ప్రత్యర్థులను బోల్తా కొట్టించగల మేధావి. పీయూష్‌ చావ్లా ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 181 మ్యాచ్‌లు ఆడిన ఈ స్పిన్నర్‌.. 179 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన స్పిన్‌ మాయాజాలంతో వైవిధ్య బంతులు సంధించగల చావ్లా కెరీర్‌ బెస్ట్‌ 17 పరుగులకు నాలుగు వికెట్లు.

అమిత్‌ మిశ్రా :ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 161 మ్యాచ్‌లు ఆడిన స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా.. 173 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను ముప్పు తిప్పలు పెట్టాడు. మిశ్రా బెస్ట్‌ 17 పరుగులకు అయిదు వికెట్లు.

అశ్విన్‌ : క్రికెట్‌ మేధావిగా పేరుగాంచిన అశ్విన్‌... ప్రత్యర్థిని తన ఉచ్చులో బిగించి అవుట్‌ చేయడంలో నేర్పరి. ఇటీవలే టెస్టుల్లో 500 వికెట్లు మైలురాయిని కూడా చేరుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 197 మ్యాచ్‌లు ఆడిన మాస్టర్‌ మైండ్‌ అశ్విన్‌ 171 వికెట్లు తీసి సత్తా చాటాడు. అశ్విన్‌ బెస్ట్‌ 34 పరుగులకు నాలుగు వికెట్లు.

లసిత్‌ మలింగ : అంతర్జాతీయ క్రికెట్‌లో మలింగ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. తన వైవిధ్య బౌలింగ్‌ యాక్షన్‌తో, యార్కర్లతో మలింగ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఐపీఎల్‌లోఇప్పటివరకూ 122 మ్యాచ్‌లు ఆడిన ఈ సీమర్‌.. 170 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన వైవిధ్య బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించి బ్రావో బెస్ట్‌ 13 పరుగులకు అయిదు వికెట్లు.

భువనేశ్వర్‌ కుమార్‌ : స్వింగ్‌ కింగ్‌గా పేరుగాంచిన భువనేశ్వర్‌ కుమార్‌ ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 160 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచుల్లో 170 వికెట్లు తీశాడు. భువీ బెస్ట్‌ 19 పరుగులకు అయిదు వికెట్లు.సునీల్‌ నరైన్‌ : ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 162 మ్యాచ్‌లు ఆడిన స్పిన్నర్‌ సునీల్‌ నరైన్ 163 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను ముప్పు తిప్పలు పెట్టాడు. నరైన్‌ బెస్ట్‌ 19 పరుగులకు అయిదు వికెట్లు.రవీంద్ర జడేజా : ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 226 మ్యాచ్‌లు ఆడిన స్పిన్నర్‌ జడేజా 152 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను ముప్పు తిప్పలు పెట్టాడు. జడ్డూ బెస్ట్‌ 16 పరుగులకు అయిదు వికెట్లు.హర్భజన్‌ సింగ్‌ : ఐపీఎల్‌లో 120 మ్యాచ్‌లు ఆడిన బజ్జీ 150 వికెట్లు తీసి సత్తా చాటాడు. బజ్జీ బెస్ట్‌ 18 పరుగులకు అయిదు వికెట్లు.

ABOUT THE AUTHOR

...view details