తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్ ఆడియోను ప్రసారం చేయలేదు - నీతికి కట్టుబడి ఉన్నాం' - IPL 2024 - IPL 2024

Rohith Sharma Star sports : తన ప్రైవసీని స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ఉల్లంఘించిందని ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై సదరు ఛానల్​ స్పందించింది. Source ETV Bharat

Source ETV Bharat
Rohith Sharma (Source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 8:00 PM IST

Rohith Sharma Star sports : మైదానంలో ప్లేయర్స్​ మధ్య ఏ చిన్న విషయం చోటుచేసుకున్నా, కెమెరాలు వాటిని రికార్డ్ చేస్తూ ప్రసారం చేస్తుంటాయి. అయితే రీసెంట్​గా స్టేడియంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై తాజాగా IPL బ్రాడ్‌కాస్టర్‌ స్టార్ స్పోర్ట్స్ వివరణ ఇచ్చింది. వైరల్ అయిన రోహిత్ శర్మ పర్సనల్ కన్వర్జేషన్‌ వీడియోలో ఆడియోను తాము ప్రసారం చేయలేదని పేర్కొంది. హిట్ మ్యాన్​ వ్యాఖ్యలను ఖండించింది.


"మే 16న వాంఖడే స్టేడియంలో జరిగిన ట్రైనింగ్‌ సెషన్‌లో తీసిన క్లిప్‌కు స్టార్‌ స్పోర్ట్స్‌కి ఆథరైజ్డ్‌ యాక్సెస్‌ ఉంది. రోహిత్‌ సైడ్‌లైన్స్‌లో అతని స్నేహితులతో మాట్లాడుతుండటం క్లిప్‌లో కొద్దిసేపు కనిపించింది. ఈ కన్వర్జేషన్‌కు సంబంధించి ఏ ఆడియో రికార్డ్ కాలేదు. ప్రసారం చేయలేదు. రోహిత్‌ తన ఆడియోను రికార్డ్ చేయవద్దని రిక్వెస్ట్‌ చేస్తున్న క్లిప్‌ను మాత్రం, స్టార్ స్పోర్ట్స్ ప్రీ-మ్యాచ్ ప్రిపరేషన్స్‌ లైవ్‌ కవరేజీలో ప్రదర్శించాం. అంతకు మించి ఏ ఉల్లంఘనలకు పాల్పడలేదు." అని పేర్కొంది.

అసలేం జరిగిందంటే? -మే 16న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ వర్సెస్‌ ముంబయి ఇండియన్స్‌ మ్యాచ్‌కు ముందు ధవల్ కులకర్ణితో రోహిత్ మాట్లాడాడు. కెమెరాలు తన వైపు ఫోకస్ చేసినట్లు గమనించిన హిట్​మ్యాన్​ ఆడియోను ఆఫ్ చేయమని బ్రాడ్‌కాస్టర్‌ను రిక్వెస్ట్‌ చేశాడు. అంతకన్నా ముందు మే 11న రోహిత్‌ - కేకేఆర్‌ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో మాట్లాడుతున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. KKR కూడా తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసి దాన్ని తొలిగించింది. అందులో ముంబయి ఇండియన్స్‌తో తాను ఉండకోవచ్చని, రానున్న మెగా వేలంలో మరో ఫ్రాంచైజీకి మారుతానని రోహిత్ అన్నట్లు ప్రచారం మొదలైంది.

వీటన్నింటినీ ఉద్దేశించి రోహిత్‌ మాట్లాడుతూ - " స్టార్​ స్పోర్ట్స్ తన ప్రైవసీని ఉల్లంఘించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి ప్రైవేట్ సంభాషణలను ప్రసారం చేయడం ద్వారా భవిష్యత్​లో బ్రాడ్‌కాస్టర్లు, క్రికెటర్లు, అభిమానుల మధ్య విశ్వాసం సన్నగిల్లుతుందని అన్నాడు. అందుకే దీనిపై స్పందించిన స్టార్ స్పోర్ట్స్ ప్లేయర్స్ ప్రైవసీని తాము గౌరవిస్తామని, నీతికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.

'నా ప్రైవసీకి భంగం కలిగించే పని చేశారు - వద్దన్నా కూడా వీడియోలు తీశారు' - Rohit Sharma Star Sports

సన్​రైజర్స్​ వర్సెస్​ కేకేఆర్ - బలాబలాలు, రికార్డులివే - IPL 2024 Qualifier 1

ABOUT THE AUTHOR

...view details