Kohli Fire On Women Journalist : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉందన్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఆసీస్ ప్లేయర్లతో వివాదానికి దిగిన సందర్భాలను చూశాం. కానీ ఈ సారి ఆసీస్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అసలేం జరిగిందంటే? - ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. టాయిలెండర్ల అసాధారణ ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి నుంచి గట్టెక్కింది. దీంతో ఈ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. అయితే నాలుగో టెస్ట్ మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు గబ్బా నుంచి మెల్ బోర్న్‌కు చేరుకుంది. అయితే మెల్ బోర్న్ విమానాశ్రయానికి భార్య అనుష్క శర్మతో పాటు వామికా, అకాయ్‌లతో విరాట్ కోహ్లీ వెళ్లాడు.
అప్పుడు అక్కడే ఎయిర్‌పోర్ట్‌లో ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్‌ను కొందరు జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తుండగా - అనుష్క శర్మ, అకాయ్, వామికలతో కలిసి కోహ్లీ అటువైపు రావడం ఆసీస్ మీడియా చూసింది. దీంతో విరాట్ కుటుంబం ఫొటోలు, వీడియోలు తీసేందుకు మీడియా ప్రయత్నించింది.
అయితే తమ పిల్లల ఫొటోలు, వీడియో తీయొద్దని కోహ్లీ సూచించాడు. "నా పిల్లల విషయంలో నాకు కొంత ప్రైవసీ కావాలి. నన్ను అడగకుండా మీరు ఫొటోలు తీయొద్దు" అని కోహ్లీ జర్నలిస్టులతో అన్నాడు. కానీ ఆసీస్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన విరాట్, ఆసీస్ మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగాడు. ఓ మహిళా జర్నలిస్ట్‌ను మందలించాడు. తీసిన వీడియో, ఫొటోను డిలీట్ చేయాలని సూచించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, ఇప్పటికే తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయొద్దని, తమ ప్రైవసీని గౌరవించాలని మీడియాను కోరారు విరుష్క దంపతులు. పాపరాజీలను కూడా స్పెషల్‌గా రిక్వెస్ట్ చేశారు. ఈ ఏడాదే అనుష్క శర్మ అకాయ్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కూతురు వామికా 2021లో జన్మించింది.
Indian cricket superstar Virat Kohli has been involved in a fiery confrontation at Melbourne Airport. @theodrop has the details. https://t.co/5zYfOfGqUb #AUSvIND #7NEWS pic.twitter.com/uXqGzmMAJi
— 7NEWS Melbourne (@7NewsMelbourne) December 19, 2024
విజయ్ దేవరకొండ నటించిన ఆ సినిమా అంటే ఇష్టం : ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్
'బ్యాటర్‌గా ఎంట్రీ ఇచ్చి- 500 వికెట్లతో టాప్ 2బౌలర్‌గా ఎదిగాడు'- అశ్విన్ జర్నీపై మాజీ క్రికెటర్