Hydra Demolitions in Alkapuri : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై మున్సిపాలిటీ, హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని 'అనుహార్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్'లో అనుమతి లేకుండా వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారన్న ఫిర్యాదులను పరిశీలించి, నాలుగు షట్టర్లను అధికారులను తొలగించారు. ఉదయం అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ అధికారులను అపార్ట్‌మెంట్‌లోని పలువురు అడ్డుకున్నారు. వారి అభ్యర్థనలను పట్టించుకోని అధికారులు రెండు జేసీబీలతో షట్టర్లను ధ్వంసం చేశారు. దీంతో హైడ్రా, మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర అగ్రహం వ్యక్తంచేశారు.
ఫిర్యాదుతో రంగంలోకి హైడ్రా : 2016లో హెచ్ఎండీఏ అనుమతులతో రామిరెడ్డి అనే యజమాని సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, 5 అప్పర్ ఫ్లోర్లతో అనుహార్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్‌ను నిర్మించారు. అయితే అందులో నివాసిస్తున్న వారి కోసం గ్రౌండ్‌ఫ్లోర్‌లో బ్యాంకు, నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయల దుకాణాల ఏర్పాటు చేసి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ విషయంపై అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి హైడ్రాకు, స్థానిక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా అపార్ట్‌మెంట్‌లో వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు.
ఆ కట్టడాలను హైడ్రా కూల్చదు - రంగనాథ్ మరో కీలక ప్రకటన
అధికార ప్రకటన చేయనున్న రంగనాథ్ : ఆ ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఈ నెల7న అక్కడికి వెళ్లి వాణిజ్య సముదాయాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందే మున్సిపల్ అధికారులు నవంబర్ 27న మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్‌కు నోటీసులు జారీ చేసి ఏడు రోజుల్లో తొలగించాలని సూచించారు. నోటీసులకు యజమాని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దీంతో ఈ ఉదయం అక్కడికి చేరుకున్న సిబ్బంది నాలుగు షట్టర్లను తొలగించారు. దీనిపై యజమానితోపాటు షట్టర్లలో వ్యాపారం చేస్తున్న వారు తీవ్రంగా మండిపడ్డారు. కాసేపు సమయం అడిగినా అధికారులు ఆగకుండా కూల్చివేతలు జరిపారని వాపోయారు. మరోవైపు మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్‌లో షట్టర్ల తొలగింపుపై హైడ్రా అధికారిక ప్రకటన చేయనున్నట్లు రంగనాథ్ వెల్లడించారు.
"ఆ ఇళ్లను కూల్చం - వీటిని వదలం" : హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
హైడ్రా మరో కీలక నిర్ణయం - కొత్త ఏడాది నుంచి ప్రతి సోమవారం ప్రజలకు ఆ అవకాశం