SSC Board Releases 10th Exam Schedule : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు వివరాలను ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తగగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయని అధికారులు తెలిపారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ :
తేదీ | పరీక్ష | సమయం |
2025 మార్చి 21 | ఫస్ట్ లాంగ్వేజ్ | ఉదయం 9.30-12.30 |
మార్చి 22 | సెకండ్ లాంగ్వేజ్ | ఉదయం 9.30-12.30 |
మార్చి 24 | ఇంగ్లీష్ | ఉదయం 9.30-12.30 |
మార్చి 26 | గణితం | ఉదయం 9.30-12.30 |
మార్చి 28 | ఫిజిక్స్ | ఉదయం 9.30-11.00 |
మార్చి29 | బయాలజీ | ఉదయం 9.30-11.00 |
ఏప్రిల్ 2 | సోషల్ స్డడీస్ | ఉదయం 9.30-12.30 |
- ఏప్రిల్ 3న ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పరీక్ష, 4న ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్ష జరగనుంది.