IPL 2024 Riyan Parag :ఐపీఎల్ 2024లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఇరు వైపు ఆటగాళ్లు జట్టు విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం ఒక్క పరుగు దూరంలో కోల్పోయింది. ఈ చేధనలో యశస్వీ జైస్వాల్‌తో కలిసి రియాన్ పరాగ్ సృష్టించిన ప్రభంజనమే హైలెట్. ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో 77 పరుగులు చేసిన అతడు 2024 సీజన్‌లో ఇప్పటి వరకు 409 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నాలుగో స్థానంలో నిలిచాడు.
అయితే ఇటీవలే బీసీసీఐ అనౌన్స్ చేసిన టీ20 వరల్డ్ కప్ జట్టులో రియాన్ పరాగ్ చోటు దక్కించుకోలేదు. ఆ కసి మొత్తాన్ని ఈ మ్యాచ్‌లో చూపించేశాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస వికెట్ల తర్వాత క్రీజులోకి వచ్చి పాతుకుపోవడమే కాకుండా బౌండరీలతో సన్‌రైజర్స్‌పై ఆధిపత్యాన్ని చూపించాడు. తొలి ఓవర్‌లోనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో జోస్ బట్లర్, సంజూ శాంసన్‌లు డకౌట్‌గా వెనుదిరగ్గా క్రీజులోకి వచ్చాడు పరాగ్. యశస్వీ జైశ్వాల్‌తో కలిసి 78 బంతుల్లో 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భువీ డెత్ ఓవర్లలో మ్యాజిక్ చేయకపోయి ఉంటే రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వల్ల రాజస్థాన్ జట్టే గెలిచి ఉండేది.
ఈ స్థాయి ఆటను కనబరిచి కూడా తన బెస్ట్ ఫామ్ ఇది కాదని, అంటున్నాడు పరాగ్. "నేను ఇంకా చాలా అంశాల్లో ఇంప్రూవ్ కావాల్సి ఉంది. నా బెస్ట్ ఫామ్‌లో లేకపోవడం వల్లనే ఈ గేమ్ ఫినిష్ చేయలేకపోయాను. కొంతమేర పర్‌ఫెక్ట్‌గా ఆడగలిగాను. తప్పుల నుంచి నేర్చుకుని మరోసారి అవి జరగకుండా చూసుకుంటాను. ఇది నా బెస్ట్ ఇన్నింగ్సా. కాదు ఒకవేళ నేను సెంచరీ చేసి ఉంటే బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకునే వాడిని" అని పరాగ్ వెల్లడించాడు.
కాగా, కొన్నేళ్లుగా లోయర్ ఆర్డర్‌లో ఆడుతున్న పరాగ్ కచ్చితంగా నెం.4లో ఆడాల్సిన ప్లేయర్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వరల్డ్ కప్ జట్టులో అతడికి చోటు కల్పించకపోవడంతో ఆ కసిని ఈ మ్యాచ్‌లో చూపించాడని అంటున్నారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరోసారి పరాగ్ ప్రదర్శనను పరిశీలనలోకి తీసుకోవాలంటూ సూచిస్తున్నారు.
409 పరుగులతో టాప్ 4లోకి - ఈ సీజన్‌లో పరాగ్ తన అత్యుత్తమ ప్రదర్శనతో లఖ్‌నవూ సూపర్ జెయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను దాటేశాడు. ఈ సీజన్‌లో రాహుల్ 10 ఇన్సింగ్స్‌లలో 406 పరుగులు సాధిస్తే, పరాగ్ తొమ్మిది ఇన్నింగ్స్‌లలోనే 409 పరుగులు చేయగలిగాడు. వీళ్లిద్దరి కన్నా ముందు రుతురాజ్ గైక్వాడ్ టాప్ 1, విరాట్ కోహ్లీ టాప్ 2, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ మూడో స్థానంలో నిలిచారు.
వరల్డ్ కప్‌కు సెలక్ట్ చేయలేదనా ఈ వీరబాదుడు? - IPL 2024 Riyan Parag - IPL 2024 RIYAN PARAG
IPL 2024 Riyan Parag : సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన తమ జట్టుకు అండగా నిలిచాడు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్. 49 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టును దాదాపు విజయానికి చేరువ అయ్యేంత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. పూర్తి వివరాలు స్టోరీలో.
IPL 2024 Riyan parag (The Associated Press)
Published : May 3, 2024, 9:58 AM IST