తెలంగాణ

telangana

ETV Bharat / sports

విధ్వంసం సృష్టిస్తున్న తెలుగు కుర్రాడు - ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే! - IPL 2024 SRH Nitish Kumar Reddy - IPL 2024 SRH NITISH KUMAR REDDY

IPL 2024 SRH Nitish Kumar Reddy : క్లిష్ట సమయంలో బ్యాటింగ్‌కు దిగి వికెట్ కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నించకుండా భారీ షాట్లు బాది జట్టుకు మంచి స్కోరు తెచ్చిపెడుతున్నాడు సన్​రైజర్స్​ నితీశ్ రెడ్డి. తాజాగా జరిగిన రాజస్థాన్​ - సన్​రైజర్స్ మ్యాచ్​లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. పూర్తి వివరాలు స్టోరీలో

The Associalted Press
IPL 2024 SRH Nitish Kumar Reddy (The Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 9:14 AM IST

IPL 2024 SRH Nitish Kumar Reddy : విశాఖ కుర్రాడు ఆల్-రౌండర్ నితీశ్ కుమార్ బ్యాట్‌తో భళా అనిపించుకుంటున్నాడు. గత సీజన్లో పేసర్‌గా రాణించిన ఈ తెలుగోడు ఇప్పుడు బ్యాట్‌తో అదరగొడుతూ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. టాప్ఆర్డర్ బ్యాటర్​గా సత్తా చాటుతున్నాడు. గురువారం(మే 2) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గెలిపించడంలో కీలకంగా వ్యవహరించాడు. పిచ్‌పై అవగాహన తెచ్చుకుని, పరిస్థితులకు తగ్గట్టుగా నిలదొక్కుకుని, భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ధాటిగా ఆడింది. అయితే మొదట 35కే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లోకి వెళ్లిన తన జట్టును ఆదుకుకున్నాడు నితీశ్​. తొలి 10 బంతుల్లో 5 పరుగులే చేసిన అతడు ఆ తర్వాత చెలరేగి ఆడాడు. 42 బంతులు 3ఫోర్లు, 8 సిక్సులతో 76 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ, అన్‌మోల్ ప్రీతి సింగ్ అవుట్ అయిన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ చాహల్‌కు చుక్కలు చూపించాడు. 13వ ఓవర్లో స్టైట్ సిక్స్ బాది, వెనువెంటనే ఫోర్ బౌండరీకి తరలించాడు. అదే ఓవర్‌లో చివరి రెండు బాల్స్‌ను కూడా మరో సారి సిక్సు, ఆ తర్వాత ఫోర్‌గా మలిచి చాహల్‌ను బెంబేలెత్తించాడు. రివర్స్​స్పీప్​తో అతడు బాదిన ఫోర్ హైలైట్​గా నిలిచింది. అనంతరం స్పిన్నర్ అశ్విన్ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అజేయంగా 76 పరుగులు చేసి తన టీ20 కెరీర్​లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు.

ఐపీఎల్ 2024లో నితీశ్ వండర్స్

  • దిల్లీపై మ్యాచ్‌లో 37(27 బంతుల్లో) పరుగులు, రెండు వికెట్లు
  • పంజాబ్‌తో మ్యాచ్‌లో 64 పరుగులు, ఒక వికెట్
  • ఇప్పటివరకూ ఆడిన 6 ఇన్నింగ్స్‌లో 154 స్ట్రైక్ రేట్​తో 219 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి.

చాహల్ లాంటి బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొన్న నితీశ్ ప్రదర్శనను సీనియర్లు మెచ్చుకుంటూ ఫ్యూచర్ క్రికెట్ లో ఈ పేరు మార్మోగిపోతుందంటూ కితాబిస్తున్నారు.

"చాహల్ లాంటి బౌలింగ్ ను ఎదుర్కొని స్ట్రైట్ సిక్సు కొట్టడం ఈజీ టాస్క్ కాదు. ఫ్యూచర్ క్రికెట్‌లో ఈ పేరు ఇంకా వింటారు" - మొహమ్మద్ కైఫ్

"ఇండియన్ సెలక్టర్లు అతినిపై కన్నేయాలి. కచ్చితంగా ఇండియా-ఏ జట్టులోకి తీసుకోవాలి. ప్రత్యర్థి ఎవరనేది చూడకుండా ధాటిగా ఆడగలడు" - యూసఫ్ పఠాన్

"ఇండియన్ సెలక్టర్ల సుదీర్ఘ కాల నిరీక్షణకు నితీశ్ బ్రేక్ వేస్తాడు" - హర్షా బోగ్లే

"అంత ఒత్తిడిలోనూ స్పిన్ బౌలింగ్ ఎదుర్కొని అద్భుతమైన షాట్‌లు ఆడగలిగాడు. ఈ రోజు నుంచి అతను నా ఫేవరేట్ క్రికెటర్లలో ఒకడు" - షేన్ వాట్సన్

ఒక్క పరుగు తేడాతో సన్​రైజర్స్​ థ్రిల్లింగ్ విక్టరీ - IPL 2024

వారెవ్వా భువి - చివరి ఓవర్​లో మాయ! - IPL 2024 RR VS SRH

ABOUT THE AUTHOR

...view details