IPL 2024 Punjab Kings VS Sunrisers Hyderabad : తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లోనూ పలు రికార్డులు కూడా నమోదయ్యాయి.
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ అతి తక్కువ మార్జిన్‌తో ఇప్పటివరకు మూడు మ్యాచుల్లో ఓడింది. తాజా ఓటమితో కలిపి నాలుగోది. బెంగళూరుపై(2016) ఒక్క పరుగు, కోల్‌కతాపై (2020) 2 పరుగులు, రాజస్థాన్ రాయల్స్‌పై(2021) 2 పరుగుల తేడాతో పరాజయం అందుకుంది.
అలానే ఐపీఎల్‌లో అతి తక్కువ మార్జిన్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచిన మొదటి మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఇప్పుడు 2 పరుగుల తేడాతో గెలుపొందింది. 2022లో ముంబయి ఇండియన్స్‌పై 3 పరుగులు, 2014లో దిల్లీ క్యాపిటల్స్‌పై 4 పరుగులు, 2016లో పుణె, బెంగళూరు జట్లపై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇంకా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల శాతం 68.18గా ఉంది. ఇప్పటి వరకు 22 మ్యాచుల్లో ఈ రెండు జట్లు తలపడగా 15 మ్యాచుల్లో హైదరాబాదే సత్తా చాటింది. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబయి ఇండియన్స్ 71.88 శాతం, హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 70 శాతం, డెక్కన్ ఛార్జర్స్‌పై పంజాబ్ కింగ్స్ 70 శాతం విజయాలను నమోదు చేశాయి.
Sunrisers Hyderabad Nitish kumar IPL :ఇకపోతే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ రెడ్డికి ఇదే తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం విశేషం. ఆల్‌రౌండర్ అయిన ఇతడు బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ(64) బాదడంతో పాటు బౌలింగ్‌లోనూ ఒక వికెట్ తీశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 39/3 అతడు చెలరేగి ఆడడంతో హైదరాబాద్ 182 పరుగులు చేయగలిగింది. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
మ్యాచ్ విజయంలో తాను కీలకంగా వ్యవహరించడంపై నితీశ్ మాట్లాడాడు. "వ్యక్తిగతంగా నా ఆట ఎంతో సంతృప్తికరంగా అనిపించింది. జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించడం సంతోషంగా ఉంది. ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాను. నాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. పంజాబ్ సీమర్లు అద్భుతంగా బంతులు సంధించారు. నేను ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే ఆడాను. కగిసో రబాడ బౌలింగ్‌లో సిక్స్ బాదడం ఎప్పటికీ మరిచిపోలేను. ప్రస్తుత సీజన్లో సీమర్లు స్లో బౌన్సర్లతో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ బంతులను ఎదుర్కోవడం చాలా కష్టమే. నేను కూడా ఇలాంటి బౌలింగే చేశాను. ఏదైనా సరే జట్టు కోసం అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తాను" అని నితీశ్ అన్నాడు.
15 ఏళ్లకే బీసీసీఐ అవార్డు, ఫస్ట్ క్లాస్ రికార్డులు - ఎవరీ నితీశ్ కుమార్ ? - Nitish Kumar SRH
తెలుగోడి సత్తా - నితీశ్ కుమార్ దెబ్బకు పంజాబ్ బౌలర్లు విలవిల - IPL 2024 Punjab Kings VS SRH